గడిచిన కొన్ని నెలల క్రితం కన్నడ హీరో దర్శన్ , నటి పవిత్ర గౌడ అభిమాని అయిన రేణుకా స్వామి హత్య కేసులో చిక్కుకోవడంతో ఒక్కసారిగా కన్నడ ఇండస్ట్రీనే ఉలిక్కిపడింది. దీంతో కొద్దిరోజుల పాటు జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. అయితే ఇటీవల హీరో దర్శన్ అనారోగ్య సమస్యల కారణంగా జైలు నుంచి బయటికి రాగా ఇప్పుడు పవిత్ర గౌడ కూడా బెయిల్ మీద బయటకు వచ్చింది. అయితే ఇలా బెయిల్ మీద బయటకి వచ్చి రావడంతోనే తన ప్రియుడిపైన ఉన్న ప్రేమను మరొకసారి బయటపెట్టేసింది.



దర్శన్ కి గత కొంతకాలంగా పవిత్ర గౌడ్ తో రిలేషన్ ఉందని రూమర్స్ కూడా ఎక్కువగా వినిపించాయి.. అంతేకాకుండా పవిత్ర నీ ఇబ్బంది పెట్టారనే విషయంలోనే రేణుకా స్వామిని హత్య చేయించారని అందుకు ప్రేమే నిదర్శనం అన్నట్లుగా వార్తలు వినిపించాయి. మొదట ఆరోపణలు అనుకున్నప్పటికీ బలమైన సాక్షాలు రావడంతో కొన్ని నెలలపాటు అటు పవిత్ర, దర్శన్  ఇద్దరు కూడా జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది.


అయితే ఇప్పుడు తాజాగా పవిత్ర గౌడ బెయిల్ మీద బయటకి రాగానే వజ్ర మునీశ్వర ఆలయం వద్ద ప్రత్యేకమైన పూజలు చేయించిందట..ముఖ్యంగా హీరో దర్శన్ పేరుపై ఈ ప్రత్యేకమైన పూజలు చేయించినట్లు సమాచారం. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ పూజలు చేయించిందట. దర్శన్ కూడా గత కొన్ని నెలలుగా వెన్ను నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని దీని కారణంగానే బెయిల్ మీద బయటకు వచ్చినట్లు సమాచారం.. మరి ఇలాంటి సమయంలో ఇప్పుడు దర్శన్ కోసం పవిత్ర గౌడ పబ్లిక్కుగానే ఇలా పూజలు చేస్తూ ప్రేమ చూపడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి మరొకసారి హీరో మీద తన ప్రేమ తగ్గలేదని నటి పవిత్ర గౌడ చేసిన పనికి అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎంతవరకు వెళుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: