మొదట బుల్లితెరపై తన కెరీర్ని ప్రారంభించి పలు రకాల సీరియల్స్ లో నటించిన హిమజ మొదట స్వయంవరం అనే సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత సీరియల్స్ లో నటించి సినిమాలలో కూడా కీలకమైన పాత్రలలో నటించింది హిమజ. ఒకవైపు నటిగా కూడా ప్రత్యేకమైన స్థానాన్ని అందుకుంది. బిగ్బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా వెళ్లిన ఈమె మరింత అభిమానులను సంపాదించుకుంది. చివరిగా జ అనే సినిమాలో హీరోయిన్గా నటించిన మళ్లీ ఆ తర్వాత నటించలేదు హిమజ.
చాలా ఏళ్ల తర్వాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన హిమజ తన సినీ జీవితంలో మొదట్లో ఎదుర్కొన్న కష్టాలను తెలియజేసింది.. ముఖ్యంగా తను చాలా సార్లు ఇబ్బందిలో పడ్డాను అని ఒకానొక సమయంలో ఈ ఇబ్బందుల వల్ల ఇండస్ట్రీనే వదిలి పెట్టాలనుకున్నాను అంటూ తెలిపింది.. అయితే బిగ్బాస్ లో అవకాశం రావాలి అంటే కమిట్మెంట్లు ఇవ్వాల్సిందేనా అంటూ యాంకర్ అడగగా.. ఈ కమిట్మెంట్ అనే పదానికి ఈమధ్య చాలా అర్థాలు మారిపోతూ ఉన్నాయని అసలు కమిట్మెంట్ అంటేనే ఏంటో అర్థం కావడం లేదని కూడా వెల్లడించింది. కానీ బిగ్ బాస్ లో మాత్రం అలాంటివి జరగవు అని ఏదైనా స్ఫూర్తిగా ఉండే వాళ్ళని తీసుకుంటారని ముఖం మీదే మాట్లాడి రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ లను మాత్రమే హౌస్ లోకి ఎంచుకుంటారని తెలిపింది.
ఇప్పటికే మూడుసార్లు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాము ఎక్కడ కూడా తనకు అలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని తన ఫ్రెండ్స్ కూడా ఎవరు ఇలాంటి విషయాల పైన చెప్పలేదని తెలిపింది. ఇక ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనేది ఆఫర్స్ వచ్చాయంటే కమిట్మెంట్ ఇచ్చిందని రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు.కానీ టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వస్తాయి కాస్త ఓపికగా ఎదురు చూడాలని తెలిపింది హిమజ..