తెలుగు బుల్లితెర పైన మెగాస్టార్ అంటే అందరికీ గుర్తుకు వచ్చే నటుడు ప్రభాకర్ మాత్రమే.. ఈయన ఎక్కువగా ఈటీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ లో నటిస్తూ ఉండేవారు. దాదాపుగా ఎన్నో ఏళ్లుగా పలు సీరియల్స్ లో నటించిన ప్రభాకర్ బుల్లితెర మెగాస్టార్ గా పేరు సంపాదించారు. ఈయన సీరియల్స్ లోనే కాకుండా పలు చిత్రాలలో కూడా నటించారు. ఇలాంటి ప్రభాకర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఇండస్ట్రీకి సంబంధించిన ఒక నటితో ఎఫైర్ పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది.


ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన ఒక నటితో ఎఫైర్ వల్ల తన భార్యను మోసం చేశానని విషయాన్ని బయటపెట్టారు. ఈ విషయం విన్న అందరూ కూడా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.. ప్రభాకర్ మాట్లాడుతూ తాను తన భార్యను ఎంతో ప్రేమించానని కానీ ఒక విషయంలో మోసం చేశాను.. తన భార్యకు తెలియకుండా ఇండస్ట్రీలో ఉండే ఒక నటితో ఎఫైర్ పెట్టుకున్నారని తెలిపారు.. అయితే ఆమెతో ఎక్కువ కాలం రిలేషన్ లో ఉండలేకపోయానని.. తన కుటుంబం గురించి ఆ నటితో ఎక్కువగా చెప్పే వాడినట్టు తెలియజేశారు ప్రభాకర్ .



 ఈ ఎఫైర్ విషయం తెలిసి తన భార్య కూడా చాలా బాధపడిందని లోలోపల చాలా ఇబ్బందులు ఎదుర్కొందని.. ఈ విషయం తనకు తెలిసి ఆ నటికి దూరంగా ఉన్నానని.. ఆ తర్వాతే తన భార్యకు సర్ది చెప్పి ఇక మీదట తాను ఇలాంటి తప్పులు చేయనని చెప్పానని కానీ ఆ సమయంలో తన భార్య తనని పక్కకు పెట్టకుండా అర్థం చేసుకొని తన తప్పును మన్నించిందని తెలిపారు ప్రభాకర్. అలా ఆ నటితో బ్రేకప్ చెప్పి తన భార్యతోనే తన జీవితాన్ని కంటిన్యూ చేశానని తెలిపారు. ప్రస్తుతం తమ కుటుంబంతో చాలా హ్యాపీగా ఉన్నానంటూ ప్రభాకర్ తెలియజేశారు. మొత్తానికి ఎఫైర్ విషయం పైన ఎట్టకేలకు నిజం చెప్పేశారు బుల్లితెర మెగాస్టార్.

మరింత సమాచారం తెలుసుకోండి: