తెలుగు బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ ఎన్నో ఏళ్లుగా మెయిల్ యాంకర్ గా టాప్ ప్లేస్ లో ఉన్నారు.. ఏన్నో ప్రోగ్రాంలో ,షోలలో తన హవా చూపించిన యాంకర్ ప్రదీప్ పెళ్లి విషయంపై ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటారు.. ముఖ్యంగా యాంకర్ ప్రదీప్ పైన పెళ్లి గురించి ఎన్నో రూమర్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. అయితే ఆ మధ్య సినిమా హీరోగా కూడా ట్రై చేశారు. పర్వాలేదు అనిపించుకున్న యాంకర్ ప్రదీప్.. తన షో కి వచ్చిన వారందరి కూడా నవ్విస్తూ సర్ప్రైజులు చేస్తూ ఉంటారు.



అయితే యాంకర్ ప్రదీప్ చేసిన ఒక పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదేమిటంటే ఒక హీరోయిన్ కి లవ్ లెటర్ రాయడం ఆసక్తికరంగా మారింది.. అది కూడా తన జీవితంలో మొట్టమొదటిసారిగా రాసిన లవ్ లెటర్ ఇదే అంటూ తెలియజేశారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.. అఆ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ మొదట ప్రేమమ్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.


ఇటీవలే టిల్లు స్క్వేర్ సినిమాలో తన గ్లామర్ డోర్స్ తో మరింత క్రేజ్ సంపాదించుకుంది. ప్రతి సినిమాకి కూడా తనలో యాంగిల్స్ ని మార్చుకుంటూ వస్తూ ఉన్న అనుపమ.. ప్రదీప్ యాంకర్ గా చేస్తున్న కొంచెం టచ్ లో ఉంటే చెప్తా షో కి వెళ్లడం జరిగింది అలాగే తన స్కూల్ డేస్ లో మెమోరీస్ ని సైతం అక్కడ పంచుకుంది అనుపమ. ఆ సమయంలోనే తనకు ఒకటి రెండు లవ్ లెటర్స్ తప్ప మరెవరు కూడా రాయలేదని .. అయితే వారు రాసే లెటర్స్ కూడా సీరియస్ గా ప్రేమించే విధంగా లేవని అది తనకు చాలా బాధగా ఉండేదని తెలిపింది. అలాగే మరి కొంతమంది వెంటపడేవారని చెబుతూ ఉన్నప్పటికీ ఈ విషయంపై యాంకర్ ప్రదీప్ ఛాన్స్ తీసుకొని.. అనుపమకు రొమాంటిక్గా ఒక లవ్ లెటర్ రాశారు షో లోనే ప్రపోజ్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.


అయితే తెలుగులో ఉండడంతో అనుపమ కు చదవడం రాకపోవడంతో.. చదివి వినిపించిన యాంకర్ ప్రదీప్.. ప్రియమైన అను ప్రేమతో మీ ప్రదీప్ నువ్వు ఒక అద్భుతం నీ నడక ఒక అద్భుతం నీ చూపు మరో అద్భుతం.. ఈ అద్భుతాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుని ఒక అవకాశం ఇవ్వు అంటూ లవ్ ప్రపోజ్ చేయగా ఈ విషయంపై అనుపమ రియాక్ట్ అవుతూ .. మీ కొటేషన్ కి ఫిదా అవుతున్నాను అంటూ థాంక్యూ సో మచ్ అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: