అలా శ్వేత తివారికి 20 ఏళ్లు వచ్చేసరికి ఇద్దరు పిల్లలు ఉండడంతో హీరోయిన్గా ఎదగడానికి ఎంతో కష్టపడిందట.. శ్వేతా తివారి తన కెరియర్ లో చిన్న వయసులోనే భోజ్ పూరి చిత్రాలలో కూడా నటించిందట. ఆ తర్వాత సీరియల్స్ లో బాలీవుడ్ చిత్రాలలో నటించి క్రేజ్ అందుకున్న తర్వాత భోజ్ పురి ఇండస్ట్రీలో పనిచేస్తున్న సమయంలోనే ఈమెకు రాజా చౌదరితో స్నేహం ఏర్పడిందట.. ఆ తర్వాత వాటిని ప్రేమగా మారి పెళ్లి వరకు తీసుకువెళ్ళింది. అయితే రాజా చౌదరితో కుటుంబాన్ని ఎదిరించి ఈమె వివాహం చేసుకుందట.
వివాహమైన రెండేళ్లకి ఒక కూతురు జన్మించింది. ఆ తర్వాత తన భర్త నుంచి విడిపోయిన ఇమే విడాకులు తీసుకొని చాలాకాలం తర్వాత మళ్లీ శ్వేత తివారి 2013లో అభినవ్ కోహ్లీని రెండవ వివాహం చేసుకున్నదట. ఆ తర్వాత విరికి ఒక కుమారుడు కూడా జన్మించారు. మళ్లీ వివాహమైన ఆరు సంవత్సరాల తర్వాత వీరిద్దరూ విడిపోవడంతో ప్రస్తుతం శ్వేతా తివారి తన కూతురు, కొడుకుతో ఒంటరిగా తన జీవితాన్ని గడిపేస్తోందట. ప్రస్తుతం కోట్లల్లో సంపాదిస్తుందట శ్వేతా తివారి.ప్రస్తుతం పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్న శ్వేతాతివారి పలు చిత్రాలలో క కూడా కీలకమైన పాత్రలో నటిస్తోందట.