పెళ్లి అనేది కూడా ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అద్భుతమైన ఘటన.. ఇందుకోసం చాలామంది ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే కొంతమంది ప్రేమించుకొని వివాహం చేసుకున్నప్పటికీ కొన్ని కారణాల చేత విడిపోతూ ఉంటారు. ప్రేమలో ఉన్నంతవరకు ఏమీ కాదు కానీ పెళ్లి అయిన తర్వాత కూడా కష్టాలు బాధలు మొదలయ్యాయి అంటూ విడిపోయిన సందర్భాలు చాలానే జంటలను చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా సెలబ్రిటీలు ఈమధ్య తరచూ ఎక్కువగా విడిపోతున్నారు. అలా బుల్లితెర పైన మంచి క్రేజీ సంపాదించిన అమరదీప్, తేజస్విని జంట కూడా ఒకరు.



 స్టార్ మా లో ప్రసారమయ్యేటువంటి జానకి కలగనలేదు అనే సీరియల్ ద్వారా అమర్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆ సమయంలోనే బిగ్ బాస్ -7లో కూడా అవకాశం రావడంతో ఎంట్రీ ఇచ్చి మరింత క్రేజీ సంపాదించుకున్నారు. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయినా విన్నర్ కాలేదు.. బిగ్ బాస్ లో టాప్5లో నిలబడ్డారు. అమర్ భార్య, తేజస్విని కూడా తనకు చాలా సపోర్ట్ చేసింది. తాను ఇంట్లో ఎలా ఉంటాడో హౌసులో కూడా అలాగే ఉన్నారంటూ వెల్లడించింది. అంతేకాకుండా హౌసులో తన భార్యను తన తల్లిని ట్రోల్ చేయడంతో ఎమోషనల్ అయ్యారు..ఆ సందర్భంలో తేజ అమర్ కి సపోర్టివ్ గా ఉన్నది.. అమర్ కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ఆ తర్వాత తేజ అంటే తన ప్రాణమని చెప్పిన అమర్.. ఓంకార్ హోస్టుగా నిర్వహించిన ఇస్మార్ట్ జోడి షోలో పాల్గొన్నారు ఈ జంట.



అయితే ఈ షోలో రియల్ కపుల్స్ తో డాన్స్ ,ఆటలు, ఎమోషన్స్ అన్నీ కూడా చూపించడం జరిగింది. ఇందులోకి అమర్ తన భార్య తేజుతో రావడం జరిగింది. అందుకు సంబంధించి ప్రోమో కూడా వైరల్ గా మారుతోంది. అలాగే సాంప్రదాయాలకు సంబంధించి దుస్తులను కూడా ధరిస్తూ ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే యాంకర్ ఓంకార్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్న అమర్ ,తేజ ఇద్దరు కూడా తమ వైవాహిక బంధంలో హ్యాపీగా ఉన్నారా అని అడగగా.. ఇద్దరు కూడా నో అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని అభిమానులు కూడా షాక్ అయ్యారు. మరి మొత్తానికి ప్రోమో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: