తెలుగు బిగ్ బాస్-8 షోలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కంటెస్టెంట్లలో సోనియా ఆకుల కూడా ఒకరు. ఇటీవలే ఇమే వివాహం కూడా ప్రముఖ వ్యాపారవేత్త ఆయన యష్ తో జరిగింది. వీరి వివాహానికి ఇతర సెలబ్రిటీలు కూడా పాల్గొనడమే కాకుండా ప్రముఖ యాంకర్ ఓంకార్ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న సోనియా ఇటీవలే ఒక వీడియోను కూడా విడుదల చేసింది. గత కొద్దిరోజుల నుంచి తమ పెళ్లి పైన రూమర్స్ వినిపిస్తున్న తరుణంలో సోనియా ఆకుల తన యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక వీడియోని షేర్ చేసినట్లు సమాచారం.



మెహందీ వేడుకలకు సంబంధించి సోనియా,యష్ ఈ వీడియోలో ఎన్నో విషయాలను బయటపెట్టింది. యష్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చారని వారికి ఒక కొడుకు కూడా ఉన్నారని ఆ అబ్బాయిని కూడా తాను కొడుకుగానే స్వీకరించానని చెప్పుకొచ్చింది అలాగే యష్ ఫ్యామిలీ గురించి కూడా సోనియా తెలిపింది. యష్ ని పెళ్లి చేసుకోవడానికి కారణమేంటి అనే విషయం పైన సోనియా మాట్లాడుతూ.. ఎన్జీవో కి వెడ్ డిజైనింగ్ గా చేస్తున్న సమయంలో తామిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని.. బాగా క్లోజ్ అయ్యామని ఇద్దరి ఆలోచనలు కూడా ఒకటిగానే ఉన్నాయని..సోనియా కూడా తనకంటూ ఒక డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని ఉందని, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి, అలాగే ఆర్థికంగా కూడా బ్యాలెన్స్ గా ఉండాలనుకున్నాను అందులో యష్ పాత్ర కూడా చాలా ఉందని తెలిపింది సోనియా.


యష్ తనని తాను కొత్తగా ఎప్పుడు పరిచయం చేస్తూ ఉంటాడని తనలో ఎంతో మార్పు కి కూడా కారణమయ్యారని తెలిపింది సోనియా. దాదాపుగా కొన్ని ఏళ్లపాటు ట్రావెల్ చేసాము కాబట్టే మ్యారేజ్ చేసుకునేందుకు ఒప్పుకున్నానని తెలిపింది. తమ మధ్య అంతటి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి పెళ్లి వరకు తమ ప్రేమను తీసుకువెళ్లామని సోనియా ఆకుల తెలిపింది. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: