బిగ్ బాస్ 8 విన్నర్ గా నిఖిల్ గెలిచినప్పటికీ కావ్య దృష్టిలో మాత్రం విలన్ గానే మిగిలిపోయారు.. ఈ విషయాన్ని ఈమె ఇన్ డైరెక్ట్ గా నిఖిల్ కే గట్టి కౌంటర్ తగిలేలా వెల్లడించింది. వాస్తవానికి నిఖిల్ మాజీ ప్రేయసిగా కావ్య అన్న సంగతి అందరికీ తెలిసిందే.. ఇటివలె స్టార్ మా చానల్లో ప్రసారమైన ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో కూడా వీరు సందడి చేయడం జరిగింది. అలాగే వీరి మధ్య పంచ్ లు కూడా బాగానే పేలాయి. దీంతో కావ్య ఎలాంటి విషయాలు మాట్లాడిన కూడా నిఖిల్ కి ముడి పెడుతూ ఉన్నారు.


నిఖిల్ కూడా హౌస్ లో ఉన్నప్పుడు తమది జన్మజన్మల బంధం అంటూ ఆమె తన భార్య అంటూ చాలానే కథలు అల్లారు.. కానీ బయటికి వచ్చిన తర్వాత ప్లేట్ ఫిరాయించాడు నిఖిల్. అయితే రీసెంట్ గా స్టార్ మా పరివారంలో లేడీ విలన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కావ్య రియల్ లైఫ్ లో తను చాలామంది విలన్స్ లను చూశారని.. వారితో పోల్చుకుంటే వీళ్ళే పెద్ద విలన్లు కాదు అంటూ సీరియల్స్ విలన్స్ పైన పంచువేసింది కావ్య.



దీన్ని బట్టి చూస్తే నిఖిల్, కావ్యా లైఫ్ లో ఎంత పెద్దవిలనో అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో నిఖిల్ కూడా మాట్లాడుతూ.. పలు వ్యాఖ్యలు చేయడంతో అది కావ్యకే కౌంటర్ అన్నట్లుగా కనిపిస్తున్నాయట..హౌస్ లో ఉన్నప్పుడు నిఖిల్ మొదట సోనియాతో ఆమె వెళ్లిపోయిన తర్వాత మళ్లీ యష్మితో పత్యాపారం నడిపారు.. ఇద్దరితోను హగ్గులు రొమాన్స్ చేస్తూ పేరుకు మాత్రం బ్రదర్ సిస్టర్స్ అంటూ బాండింగ్ చెప్పారు ఫ్రెండ్స్ బాండింగ్ అనే వారు అలా చేస్తారు కానీ చూసే వాళ్లకు అది తేడా గానే కనిపిస్తుందంటూ కౌంటర్ వేశారు.


అంతేకాకుండా నిఖిల్ తన సొంత చెల్లిలతో తిరిగినా కూడా వేరే అమ్మాయితో తిరుగుతుందని చాలామంది అనుకుంటూ ఉంటారని అందుకే ఎవరు ఏమనుకున్న తాను తనలాగే ఉంటానని.. తాను ఒక గేమ్ షో ని గేమ్ షో లాగానే చూశానని అందుకోసం ఒకరిని వాడుకోవడం కానీ దగ్గరికి లాక్కోవడం కానీ చేయలేదంటూ తెలిపారు. కొంతమంది కావాలని నెగిటివ్ చేశారని తెలిపారు నిఖిల్. తన గురించి తనని ఇష్టపడే వారికి అసలు నిజాలు తెలిస్తే చాలు అంటూ తెలిపారు నిఖిల్..

మరింత సమాచారం తెలుసుకోండి: