నటన రంగం వైపు నుంచి బయటికి వచ్చిన తర్వాత వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది నటి అష్కా గరోడియా. ఈమె ఎక్కువగా విలన్ పాత్రలలో నటిస్తూ ఉండేదట. బుల్లితెర పైన పలు సీరియల్స్ లో కూడా ఇలాంటి పాత్రలలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. కానీ భారీ క్రేజ్ ఉన్న సమయంలోనే నటనకు గుడ్ బై చెప్పి కాస్మోటిక్ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టిందట. అలా 2002లో తన నటనకి గుడ్ బై చెప్పి వ్యాపారి రంగం వైపు దృష్టి పెట్టిందట.
ప్రస్తుతం ఈమె 1300 కోట్ల రూపాయల వ్యాపారాన్ని సైతం చేస్తోందట. తన స్నేహితులతో 2018లో రనే కాస్మోటిక్స్ అనే బ్రాండ్ ని సైతం ఏర్పరిచి భారీ క్రేజ్ అందుకుంది. ప్రస్తుతం ఈ కంపెనీ టర్నోవర్ కొన్ని కోట్ల రూపాయలు ఉన్నదట. ఈ బ్రాండ్ ఇండియాలోనే ప్రముఖ కంపెనీలలో ఒకటిగా నిలిచింది.2024 నాటికి ఈ బ్రాండ్స్ కంపెనీ ధర 1300 కోట్ల రూపాయలకు చేరిందట. అలా వ్యాపారవేత్తగా ఆష్కా గోరాడియాసక్సెస్ అయిందని కూడా చెప్పవచ్చు. ఈమె ఆచానక్ 37 సాల్ బాద్ అనే టీవీ సీరియల్ ద్వారా మొదటిసారిగా నటించిన ఆ తర్వాత ఇమే ఎన్నో పాత్రలలో నెగిటివ్ పాత్రలలోనే నటించింది.