తెలుగు బుల్లితెరపై ఎంతగానో ప్రేక్షకులను అలరించినటువంటి సీరియల్స్లలో కార్తీకదీపం సీరియల్ ముందు వరుసలో ఉంటుంది.. ఈ సీరియల్ లో వంటలక్క డాక్టర్ బాబు పేరు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఇతర భాషలలో కూడా భారీ పాపులారిటీ సంపాదించుకుంది. అయితే వంటలక్క అసలు పేరు ప్రేమి విశ్వనాథ్.. ఈమె కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమయ్యింది. ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ హీరోయిన్లకు దీటుగానే ఉన్నది. ఇటీవలే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలను కూడా షేర్ చేస్తూ ఉన్నది.


వాస్తవానికి మలయాళ ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇచ్చిన ప్రేమి విశ్వనాధ్ పలు రకాల సీరియల్స్ లోనే కాకుండా యాడ్స్లలో కూడా నటిస్తోంది. ప్రేమి విశ్వనాథ్ గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రేమి విశ్వనాథ్ లాయర్ చదివిందట. వీటితో పాటు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రెండు స్టూడియోలు కేరళలో నిర్మించిందట. ఈమె భర్త కూడా ప్రముఖ ఆస్ట్రాలజర్ అన్నట్లుగా సమాచారం.


2017లో వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్ గా కూడా ఒక అవార్డును అందుకున్నారట ప్రేమి విశ్వనాథ్ భర్త. ప్రేమి విశ్వనాథ్ స్టూడియోలో మలయాళ సినిమాలు, సీరియల్ కు సంబంధించి అన్ని షూటింగులు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయట.అంతేకాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సంబంధించి అన్ని విషయాలు కూడా ఈమె స్టూడియోలోని ఎక్కువగా జరుగుతూ ఉండడం గమనార్హం. సుమారుగా ప్రేమి విశ్వనాథ్ ఆస్తి 45 కోట్లకు వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు కూడా వామ్మో వంటలక్కకు బ్యాక్గ్రౌండ్ ఈ రేంజ్ లో ఉందా అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి బుల్లితెర పైన ఒక వెలుగు వెలుగుతోంది. వంట లక్క .ఇటీవలే కార్తీకదీపం 2 సీరియల్స్ లో నటిస్తున్నప్పటికీ పర్వాలేదు అనిపించుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: