సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్స్, టెక్నీషియన్స్ ఇలా ఎన్నో గొప్ప విభాగాలు ఉన్నప్పటికీ డైరెక్టర్ కి ఖచ్చితంగా అవుట్ ఫుట్ అనేది కేవలం కొంతమంది యాక్టర్స్ మాత్రమే ఇస్తూ ఉంటారు. అయితే ఈ రేసులో సక్సెస్ అయిన వారు చాలా తక్కువ మందే ఉంటారు. అలా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందిన వారిలో సుకుమార్ కూడా ఒకరు. మొదట సాధారణ లెక్చరర్ గా ఉండి ఆ తర్వాత స్టార్ డైరెక్టర్గా ఒక వెలుగు వెలుగుతున్నారు సుకుమార్.


రొటీన్ కమర్షియల్ ఫార్ములాలకు దూరంగా ఉంటూ విభిన్నమైన కథలతో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. మొదట ఆర్య సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన డైరెక్టర్ సుకుమార్ తన మొదటి సినిమాతోనే చాలా డిఫరెంట్ కథను తెరకెక్కించారు. ఆ తర్వాత జగడం, ఆర్య-2, 100% లవ్ , నేనొక్కడినే, రంగస్థలం, పుష్ప, పుష్ప2 వంటి చిత్రాలతో భారీ విజయాలను అందుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో, రామ్ చరణ్ తో రంగస్థలం వంటి సినిమాలు చేసి వీరిద్దరి కెరియర్లో కీలకంగా మారారు సుకుమార్.


అయితే యాంకర్ గా తన కెరీయర్ని కొనసాగిస్తున్న సమయంలో నటిగా అనసూయకి లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరంటే సుకుమార్ అని చెప్పవచ్చు.. రంగస్థలం సినిమాలో అనసూయకు కీలకమైన పాత్ర ఇచ్చారు అలాగే పుష్ప సినిమాలో కూడా ఈమె పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చేశారు. గత ఏడాది విడుదలైన పుష్ప 2 సినిమాతో మరొకసారి క్రేజీ సంపాదించుకుంది అనసూయ. రంగస్థలం సినిమా తర్వాత అనసూయ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఎన్నో చిత్రాలలో నటించింది. అనసూయ తన ఇంస్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేస్తూ నాకు జీవితాన్ని ఇచ్చింది మీరే సుక్కు సార్, మీ దృష్టిలో తాను ఎప్పుడు ఉంటానని భావనతోనే తాను ఎక్కువగా ఫోటోలు దిగలేకపోయానని మీతో పని చేయడం నా అదృష్టం మీకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: