అయితే ఇప్పుడు మళ్లీ చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరూ ఒకే వేదికపై కనిపించడమే కాకుండా ఆడియన్స్ కి కావాల్సిన మంచి రొమాంటిక్ ట్రీట్ కూడా ఇవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. సంక్రాంతి స్పెషల్ గా ఈ ఇద్దరు కలిసి ఒక షో చేశారు. ఇందులోకి సుధీర్ కూడా రీఎంట్రీ ఇచ్చారు. గెస్ట్ గా మెరిసిన సుధీర్ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. అలా ఒకరిని మరొకరు చూసుకుంటూ ఇద్దరు మెలికలు తిరిగిపోయారు. రొమాన్స్ తో రెచ్చిపోయారు. అంతేకాదు నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లో వస్తున్న తండేల్ సినిమాలోని బుజ్జి తల్లి పాటకు స్టెప్పులేస్తూ వింటేజ్ లుక్కును మళ్ళీ తీసుకొచ్చారు అని చెప్పవచ్చు.
ఇది చూసిన అభిమానులు మాకు కావాల్సింది ఇదే అంటూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం అనే పేరుతో ప్రముఖ ఛానల్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సుడిగాలి సుదీర్ రావడం, అందులోనూ రష్మితో రొమాంటిక్ సాంగ్ చేయడం అందర్నీ ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఈవెంట్ కి సంక్రాంతికి వస్తున్నాం టీం కూడా విచ్చేసింది. అనిల్ రావిపూడి , ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి వంటి వారు వచ్చి సందడి చేశారు. ఇందులో పూర్ణ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక తాజాగా విడుదలైన ప్రోమో లు కూడా ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ఈ ఎపిసోడ్ ఈనెల 14వ తేదీన టెలికాస్ట్ కాబోతోంది.