తెలుగు బుల్లితెర నటి కీర్తి భట్ తెలుగులో కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఆ తర్వాత మనసిచ్చి చూడు వంటి సీరియల్ లో కూడా నటించి క్రేజీ సంపాదించుకున్న కీర్తి భట్ రెండు కన్నడ చిత్రాలలో కూడా నటించిందట. తెలుగు బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్నప్పటికీ తన రియల్ లైఫ్ గురించి ఆమె తెలియజేసి అందరిని ఎమోషనల్ గా ఆకట్టుకుంది. అయితే విన్నర్ అవుతుందనుకున్నప్పటికీ రన్నర్ గా నిలిచింది.



ఇక హౌస్లో ఉన్నప్పుడు హీరో, డైరెక్టర్ విజయ్ కార్తీక్ ని వివాహం చేసుకోబోతున్నట్లు ఆమె తెలియజేయడం జరిగింది.2023లో వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది.. అయితే తన కాబోయే భర్తతో కలిసి ఈమె ఒకే ఇంట్లో ఉంటుందట. అతడితో కలిసి పలు రకాల వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నది. కానీ పెళ్లి డేట్ గురించి మాత్రం ఇప్పటివరకు అనౌన్స్మెంట్ చేయకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు.


అయితే తాజాగా తన కాబోయే భర్త కార్తీక్ తో కీర్తి ఒక పూజను చేస్తున్నట్టుగా ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన ఒక నెటిజన్ వివాహం కాకుండానే అలా కలిసి పూజలు చేయడం తెలుగు సాంప్రదాయం కాదు అంటూ కీర్తిని ప్రశ్నించడం జరిగింది?.. అలాగే కార్తీక్ ను ఈ విషయంపై ప్రశ్నించగా?.. ఈ విషయం పైన కీర్తి చాలా ఘాటుగానే స్పందించినట్లు తెలుస్తోంది. వివాహానికి ముందు మేము ఇలా పూజ చేస్తే ఏమవుతుందో చెప్పగలరా ఒకరిని నిందించే ముందు మనం సరైన కారణాలు చెప్పాల్సి ఉంటుంది అంటూ రిప్లై ఇవ్వడం జరిగింది..


దీంతో ఇలా ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్న కీర్తి భట్ ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటి కావడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు బుల్లితెర వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.. కొన్ని కారణాల చేత పెళ్లి ఆలస్యం అవుతొందని.. ఈ ఏడాది కచ్చితంగా తమ వివాహం జరుగుతుందని తమ స్నేహితులతో కీర్తి పెళ్లి పనులకు సంబంధించి చర్చలు జరుగుతోందట.. మరి అభిమానులకు ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: