ముఖ్యంగా స్టేజ్ మీద సాధారణంగానే షో జరుగుతున్న సమయంలో బ్లాక్ కలర్ షర్టులో ప్రియాంక స్టేజి మీదకి రావడంతో ఆ వెంటనే బుల్లెట్ భాస్కర్ తో కలిసి ఒక డ్యూయెట్ సాంగ్ కూడా వేసింది. అయితే ఆమెతో కలిసి డాన్స్ చేసిన తర్వాత ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని మరి తిప్పడంతో హఠాత్తుగా ప్రియాంక కూడా షాక్ అవ్వడం జరిగింది. ఆ వెంటనే భాస్కర్ ఆమెను దింపేయగా.. ఆమె డ్రెస్ కంఫర్టబుల్గా లేదని లిఫ్ట్ చేయొద్దని చెప్పాను కదా? అంటూ సీరియస్ గా భాస్కర్ మీద ఫైర్ అయ్యింది.
అదేదో ముందే చెప్పాలి కదా వచ్చిన తర్వాత కంఫర్ట్ గా లేదు అంటే ఎలా అంటూ భాస్కర్ కాస్త సీరియస్ గానే మాట్లాడినట్టు కనిపిస్తోంది. చూసేవారికి కంఫర్టబుల్గా కనిపిస్తుంది అంటూ తెలిపారు బుల్లెట్ భాస్కర్. మధ్యలో పవిత్ర కూడా తాను స్టార్టింగ్ లోనే చెప్పాను తనకి డ్రస్ కంఫర్ట్ గా లేదని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ కూడా భాస్కర్ మీద లేడీస్ అందరూ తగులుకోవడంతో ఒక్కసారిగా తన ఇజ్జత్ పోయినట్టుగా అనిపించడంతో భాస్కర్ సైలెంట్ గా ఉన్నారు దీంతో ప్రియాంక జైన్ చివరికి స్టేజి నుంచి కిందికి దిగి వెళ్లిపోయినట్టుగా చూపించారు. మరి ఇదంతా ప్రోమో కోసం చూపించారా లేకపోతే నిజంగానే జరిగిందో చూడాలి.