సినీ తారలకు సంబంధించి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఎప్పటికప్పుడు పలు రకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కొంతమంది కొన్ని విషయాలు నిజమనీ నమ్ముతూ ఉండగా మరి కొంతమంది వ్యూస్ కోసం ఏవేవో సృష్టిస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఈ అపద్దపు వార్తల పైన తమదైన స్టైల్ లో స్పందిస్తూ ఉంటారు. అలా ఇప్పుడు తాజాగా యాంకర్ సుమ కూడా అదే పని చేసినట్టు కనిపిస్తోంది. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో యాంకర్ సుమ గురించి వస్తున్న ఒక ఫేక్ న్యూస్ పైన ఆమె రియాక్ట్ అయినట్టు కనిపిస్తోంది.



అసలు విషయంలోకి వెళ్తే యాంకర్ సుమ కేరళలో రూ.278 కోట్ల రూపాయలతో ఒక లగ్జరీ ఇల్లును కట్టుకుందంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. ముఖ్యంగా యాంకర్ సుమ ఇల్లు కేరళలో ఎలా ఉందో చూద్దామంటూ ఒక మహిళ ఈ వీడియోని మొదలుపెట్టింది. ఆ ఇంటి  విలువ రూ .278 కోట్లు అంటూ 500 సీసీ కెమెరాలు ఇంటి చుట్టూ ఉన్నాయని అలాగే 10 మంది సెక్యూరిటీ గాడ్లు ఉన్నారంటూ వైరల్ గా మారడంతో తాజాగా ఈ విషయం మీద యాంకర్ సుమ మాట్లాడుతూ.. అసలు 278 కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు నేను ఏమైనా అంబానీ ఫ్యామిలీ అనుకుంటున్నావా 500 సీసీ కెమెరాలు అంటే అసలు నమ్మొచ్చా రూమ్ కి 5 వేసుకున్న కూడా 25 మాత్రమే వస్తాయి అంటూ తెలిపింది.


ఇది బిగ్ బాస్ హౌస్ కాదు కదా అంటూ తెలిపింది సుమ.. ఇలాంటి ఫేక్ వీడియోలు ముఖ్యంగా తాను కనిపించకుండా తన ఫోటోలను అప్లోడ్ చేస్తూ థాయిలాండ్ లోను గోవాలోను తన ఇల్లు పెట్టి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్తో క్రియేట్ చేస్తున్నారని ఇలాంటివి అసలు నమ్మొద్దు అండి అంటూ తెలిపారు. ఎలాంటి విషయాలనైనా సరే మేము వచ్చి మాట్లాడితేనే నమ్మండి ఇప్పుడు AI కూడా వచ్చింది.. పెదాలు కదులుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి కానీ తాము మాట్లాడుతున్నామో లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలంటే సుమ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: