తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ఎంతో మంది విలన్స్ ఇతర భాషలలో నుంచి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలా కేరళ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విలన్ ఆనీష్ జానీ కొక్కెన్. తెలుగులో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించారు. మొదటిసారిగా డాన్ శీను అనే సినిమాతో పరిచయమైన ఈ నటుడు ఆ తర్వాత దరువు, నేనొక్కడినే, బాహుబలి, జనతా గ్యారేజ్, కేజిఎఫ్, మహర్షి తదితర చిత్రాలలో నటించారు. అయితే ఇదంతా పక్కన పెడితే పర్సనల్ లైఫ్ విషయానికి వెళ్తే జాన్ రెండుసార్లు వివాహం చేసుకున్నారట.


మొదట 2016లో నటి మీరా వాసుదేవుని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా జన్మించారట. అయితే వీరిద్దరూ 2019లో విడాకులు తీసుకున్నట్లు సమాచారం. విడాకుల అనంతరం టాలీవుడ్ కు చెందిన ఒక నటితో ప్రేమలో పడ్డారట నటుడు జాన్.. ఇక ఆనటి ఎవరో కాదు పూజ రామచంద్రన్. ఈమె పేరు చెబితే గుర్తుపట్టకపోవచ్చు కానీ ఈమె నటించిన సినిమాల విషయాని చెబితే గుర్తుపడతారు.. స్వామి రారా సినిమాలో కర్లీ హెయిర్ ఉండే అమ్మాయిగా నటించింది.


మొదటిసారిగా లవ్ ఫెయిల్యూర్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన పూజ ఆ తర్వాత దోచేయ్, దళం, పిజ్జా తదితర చిత్రాలలో నటించింది. అయితే తెలుగులో బిగ్ బాస్ సీజన్ 2 లో కూడా పాల్గొన్నప్పటికీ విన్నర్ కాలేకపోయింది ఈ అమ్మడు. 2019లో జాన్, పూజా రామచంద్రన్ ప్రేమించుకుని మరి వివాహం చేసుకున్నారట వీరిద్దరికి ఇది రెండో వివాహం అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. అయితే ఈ నటి ఈ స్టైలిష్ విలన్ భార్య అని తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.. మొత్తానికి రాబోయే రోజుల్లో మరి వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో కలిసి నటిస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: