మాటీవీలో ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ సీరియల్ దెబ్బకు స్టార్ హీరోల సినిమాలకు ఉన్న క్రేజు కార్తీకదీపం సీరియల్ కు రావడం జరిగింది. తెలుగులోనే కాకుండా ఈ కార్తీకదీపం సీరియల్ ఏకంగా ఇండియాలోనే టాప్ ప్లేస్ ని సంపాదించుకున్నదట. ఈ సీరియల్ లో నటించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి పేరు రావడంతో పాటుగా మరికొన్ని ఆఫర్లు కూడా అందుకునేలా చేసింది. ఇందులో వంటలక్క, డాక్టర్ బాబు పేర్లు ఇప్పటి  అందరి నోటా వినిపిస్తూ ఉంటాయి.


అయితే డాక్టర్ బాబు అసలు పేరు నిరూపమ పరిటాల, వంటలక్క పేరు ప్రేమివిశ్వనాథ్. నిరూపమ్ అయితే  పలు చానల్స్ లో ప్రసారమయ్యే సీరియల్స్లలో నటిస్తూ బిజీ యాక్టర్ గా మారిపోయారు. ప్రముఖ  నటుడు రచయిత అయినటువంటి ఓంకార్ కుమారుడే ఈ నిరూపమ్ పరిటాల.. పలు సీరియల్స్ తో పాటుగా పలు రకాల యాడ్సులను రెండు చేతుల సంపాదిస్తూ ఉన్నారు. బుల్లితెర నటి మంజుల అను ప్రేమించే వివాహం చేసుకున్నారు నిరూపమ్.


చంద్రముఖి అనే సీరియల్ చేస్తున్న సమయంలో నటి మంజులాతో ఏర్పడిన ప్రేమ నిరూపమ్ పెద్దాలని ఒప్పించి వివాహం చేసుకున్నారట. వీరిద్దరి వివాహం జరిగి 15 ఏళ్లు పూర్తి కావడం జరిగిందట. గత ఏడాది కొత్త ఇల్లును కూడా నిర్మించుకొని ఇంట్లోకి చేరినట్లు తెలుస్తోంది నిరూపమ్.. అంతేకాకుండా ఒక్కో ఎపిసోడ్కి 25 నుంచి 30 వేల రూపాయల వరకు చార్జ్ చేస్తున్నారట. అయితే షూటింగ్ లేని సమయాలలో కుటుంబంతో కలిసి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు నటుడు నిరూపమ్. అయితే తాజాగా తన భార్యతో కలిసి మాల్దీవులకు వెళ్లి మరి అక్కడ ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ ఫోటోలను నిరూపం మంజుల ఇద్దరు కూడా ఫోటోలను షేర్ చేయగా.. "ఇది టైటానిక్ కాకపోవచ్చు కానీ రిఫ్రెష్ కావడానికి ఈ ట్రిప్ ఒక టానిక్ అంటూ తెలియజేశారు నిరూపమ్".

మరింత సమాచారం తెలుసుకోండి: