తెలుగులో బిగ్ బాస్ సీజన్-8 గత ఏడాది పూర్తిచేసుకుంది.. కానీ తమిళ్, హిందీ వంటి భాషలలో ఇప్పుడు తాజాగా సీజన్లను పూర్తి చేసుకొని విజయవంతంగా పూర్తి అయింది. జనవరి 19న రెండు భాషలలో గ్రాండ్ ఫినాలే జరిగింది. ఇందుకు సంబంధించి కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి తమిళ్, హిందీ వండి బిగ్ బాస్ విన్నర్లకు ప్రైజ్ మనీ ఎంత ఇచ్చారు ఎవరెవరు విన్నర్ అయ్యారు ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.



తమిళ బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ కి సంబంధించి ప్రముఖ యూట్యూబర్ ముత్తుకుమార్ విన్నర్గా గెలిచారు ఇతనికి 41 లక్ష రూపాయలు ప్రైజ్ మనీగా అందించడం జరిగింది.ఇక రన్నర్ గా సౌందర్య నిలుచగా విజే విశాల్ సెకండ్ రన్నర్పుగా నిలవడం జరిగిందట.. ఈ సీజన్ కి పోస్ట్ గా విజయసేతుపతి వ్యవహరించారు. ఒకవైపు నటుడు గానే కాకుండా మరొకవైపు ఇలా హోస్టుగా బిగ్ బాస్ కి వ్యవహరిస్తూ ఉండడంతో విజయ్ సేతుపతి రేంజ్ కూడా పెరిగింది.


ఇక హిందీ రియాల్టీ బిగ్ బాస్ షో విషయానికి వస్తే.. నటుడు కరణ్ వీర్ మెహ్రా విన్నర్ గా గెలిచారు.. హోస్టుగా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే విన్నర్ అయినా కరణ్ వీర్ కు 50 లక్షల రూపాయల ప్రైస్ మనీ గెలుచుకున్నట్లు తెలుస్తోంది. అలాగే రన్నర్పుగా నటుడు వివిఎన్ ఉండగా సెకండ్ రన్నర్పుగా యూట్యూబ్ రజాత దలాల్ ఉన్నారు. గతంలో కరణ్ ఖత్రోన్ కే కిలాడి 14వ సీజన్ కి సంబంధించి విజేతగా గెలిచారట. ఈ నటుడు పవిత్ర రిస్తా, విరుద్ధ్ , పరి హూన్ మే తదితర సీరియల్స్ లో నటించారు.


మొత్తానికి అటు తమిళ బిగ్ బాస్ సీజన్ విన్నర్ కి 41 లక్షలు ఇటు హిందీ బిగ్ బాస్ విన్నర్ కి 50 లక్షల రూపాయలు అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: