తెలుగు బుల్లితెరపై యాంకర్ గా నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది యాంకర్ ఝాన్సీ.. గతంలో తన హవా బాగా కొనసాగినప్పటికీ ఈ మధ్యకాలంలో ఈమె అడపా దడపా సినిమాలలో నటిస్తూ ఉన్నది తప్ప ఎక్కడ కూడా యాంకర్ గా కనిపించడం లేదు. ఇటీవలే ఒక షోకి ఝాన్సీ తన కూతురు దన్యతో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ పలు విషయాలను తెలియజేసింది..తన కూతురు వయసు 22 సంవత్సరాల ని తెలియజేసింది. ఝాన్సీ భర్త కూడా ఒక నటుడే ఆయన జోగి నాయుడుగా పేరుపొందారు. అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోయినప్పటికీ కూతుర్ని మాత్రం తన దగ్గర పెంచుకుంటుంది ఝాన్సీ.



ఈ షో కి హోస్టుగా  హీరోయిన్ తేజస్విని మదివాడ చేసింది.ఇందులో పలు రకాల ప్రశ్నలు కూడా ఝాన్సీని వేయగా ఆమె తన కూతురుతో పాటు తెలియజేసింది.. తేజస్విని మదివాడ ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఒక కాంట్రవర్సీ క్వశ్చన్ అడుగుతూ.. మీరు రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని ఝాన్సీని అడగగా.. నాకు అవసరం లేదంటు తెలియజేసింది యాంకర్ ఝాన్సీ.. అలాగే తాను ఏ విషయానికి కూడా భయపడనని మనిషి దగ్గర ఎవరూ లేకపోయినా, తన దగ్గర డబ్బులు లేకపోయినా అసలు భయపడినట్టు తెలియజేసింది ఝాన్సీ.



ఇక తన కూతురు ధన్య గురించి మాట్లాడుతూ తాను డైరెక్టర్ మణిరత్నం గారి దర్శకత్వంలో నటించాలని కోరిక ఉందంటూ తెలియజేసింది. అలాగే తనకు హీరో నాని అంటే చాలా ఇష్టం అని కూడా తెలిపింది ధన్య . త్వరలోనే తన కూతుర్ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని తెలియజేసినట్లు సమాచారం. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ యాంకర్ సుమ కొడుకు, సునీత కొడుకు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మరి యాంకర్ ఝాన్సీ తన కూతుర్ని ఎప్పుడు ఎంట్రీ  చేస్తుందో చూడాలి మరి. మొత్తానికి ఈ విషయం వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: