చాలామంది బుల్లితెర పైన ఇతర భాషలలో నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అలా సక్సెస్ అయిన వారు ఉన్నారు. వీటివల్ల భారీ క్రేజీ సంపాదించి తెలుగులోనే సెటిలైన బుల్లితెర నటిమనులు ఉన్నారు. అయితే కొంతమంది కొన్ని కారణాల చేత బుల్లితెర పైన బ్యాన్ కు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వారిలో సీరియల్ నటి పల్లవి గౌడ కూడా ఒకరు.. ఇమే పసుపు కుంకుమ, సావిత్రి వంటి సీరియల్స్ లో నటించి బాగానే పేరు సంపాదించుకుంది.ఇమే కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి ఎంట్రి ఇచ్చింది.


పల్లవి గౌడ సూర్యకాంతం, చదరంగం వంటి సీరియల్స్ లో మరింత క్రేజ్ సంపాదించుకున్నది..అయితే ఒకానొక సమయంలో ఒక సీరియల్లో వివాదం వల్ల తనని తెలుగులో బ్యాన్ చేశారనే విషయాన్ని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో కూడా తెలియజేస్తోంది. తాను రెండవ సీరియల్ చేస్తున్నప్పుడు సినిమా అవకాశాలు రావడంతో పర్మిషన్ తీసుకుని మరి షూటింగ్ కి వెళ్లాలని కానీ.. అనుకోకుండా బెంగళూరుకు వెళ్లడంతో ఒక నెల రోజుల పాటు తాను అక్కడే బ్లాక్ అయిపోయానని ఆ తర్వాత షూటింగుకు వెళ్లానని తెలిపింది.


అటు సీరియల్స్ డేట్లు సినిమా డేట్ లో అడ్జస్ట్ చేయడంలో తాను చాలా ఇబ్బందులకు గురయ్యానని .. సీరియల్ షూటింగులు పనులేమో జరుగుతూ ఉన్నప్పటికీ రెండు నెలలు గడిచిన తనకు డబ్బులే ఇవ్వలేదని దీంతో మరొక సీరియల్ డేట్స్ కి అవకాశం ఇచ్చానని చెప్పింది. అయితే ఇలా ఒక సీరియల్ ఉండంగానే మరొక సీరియల్ కు ఎలా అగ్రిమెంట్ చేసుకుంటావని చాలామంది తనను హెచ్చరించారని.. అలా కొద్ది రోజులపాటు తెలుగులో ఏడాది పాటు తనని బ్యాన్ చేశారంటూ తెలియజేశారని తెలిపింది. ఆ సమయంలో తాను కన్నడ,మలయాళం వంటి చిత్రాలలో నటిస్తూ ఉన్నదట. ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ తెలుగులో నుంచి పిలుపు వచ్చిందని అలా చదరంగం సీరియల్ ద్వారా మళ్లీ రీఎంట్రీ ఇచ్చానని తెలిపింది పల్లవి గౌడ.

మరింత సమాచారం తెలుసుకోండి: