జీ తెలుగులో ప్రసారమయ్యే గుండమ్మ కథ సీరియల్ ఇప్పుడు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోందట.. ప్రస్తుతం ఉన్న సీరియల్స్ లో లాంగెస్ట్ రన్ని సీరియల్ గా గుండమ్మ కథ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిందట.ఈ సీరియల్ 2000 ఎపిసోడ్ని ఇటీవలే పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. జీ తెలుగులో 2000 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న మొట్టమొదటి సీరియల్ గా నిలిచింది. అయితే ఈ సీరియల్ కంటే ముందుగా తెలుగులో కేవలం 5 సీరియల్స్ మాత్రమే 2000 ఎపిసోడ్కుపైగా టెలికాస్ట్ అయ్యిందట.. అందులో ముఖ్యంగా నాలుగు సీరియల్స్ ఈటీవీ చానల్స్ కి చెందినవిగా తెలుస్తోంది.
ఈటీవీలో ప్రసారమైన అభిషేకం సీరియల్ 4000 ఎపిసోడ్స్.. తెలుగులో లాంగెస్ట్ సీరియల్ గా సరికొత్త రికార్డులను అందుకున్నది.. ఆ తర్వాత స్థానం ఆడదే ఆధారం 3329 ఎపిసోడ్స్ లో నిలిచింది. మూడవ స్థానం మనసు మమత 3305 ఎపిసోడ్స్ నిలిచింది.. నాలుగవ స్థానం అత్తారింటికి దారేది 2344 ఎపిసోడ్స్ నిలిచింది. ఆ తర్వాత ఐదవ స్థానం స్టార్ మాలో ప్రసారమైన కుంకుమపువ్వు సీరియల్ 2501 ఐదవ స్థానంలో నిలిచింది. ఈ ఐదు సీరియల్స్ తర్వాతే ఆరవ స్థానంలో గుండమ్మ కథ సీరియల్ నిలిచింది..2018లో మొదలైన ఈ గుండమ్మ సీరియల్ కథ ఇప్పుడు ఏడేలను పూర్తి చేసుకుని ఎనిమిదో సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ సీరియల్ మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాలకు ప్రసారమవుతోంది. ఇందులో పూజా మూర్తి, వైష్ణవి, హేమలత, వేలు క్షత్రియ నటిస్తున్నారు.