బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నిఖిల్, యష్మి గౌడ మధ్య  ప్రేమాయణం కొనసాగిందని వార్తలు ఎక్కువగా వినిపించాయి. అయితే నిఖిల్ కూడా ఆమెను బాగానే ఎంటర్టైన్మెంట్ చేశారని కానీ తీరా గౌతమ్ సీన్లోకి వచ్చిన తర్వాత రివర్స్ అయ్యింది యష్మి గౌడ.. అలా గౌతమ్ తనని ఇష్టపడుతున్నారని చెప్పి నిఖిల్ కి దగ్గర అవ్వాలని చూసిన వర్కౌట్ కాలేదు. అయితే ఆ తర్వాత గుప్పెడంత మనసు సీరియల్ ముఖేష్ గౌడ కు యష్మీ గౌడ లైన్ వేసే పనిలో పడింది. వీరిద్దరూ కూడా కన్నడ వాళ్లే కావడం వల్లే కాబోలేము గాలి అటువైపుగా మళ్ళింది..


అయితే ఇప్పుడు తాజాగా ఈ ఇద్దరు కూడా ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో సందడి చేయడం జరిగింది. ఇందులో చాలామంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్  సైతం వచ్చి సందడి చేశారు. తాజాగా అందుకు సంబంధించి ప్రోమో వైరల్ గా మారడంతో ఇందులో కొన్ని ఆటలతో మాటలతో ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేశారు. ముఖ్యంగా ఇందులో చాలామంది సీరియల్ బ్యాచ్ కూడా కనిపించారు. అలాగే బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ కూడా ఇక్కడ కనిపించారు. తాను సింగిల్ రెడీ టు మింగిల్ అంటూ ఒక పెద్ద డైలాగు చెప్పడం జరిగింది.


ఇందులో భాగంగానే ఒక గేమ్ ఆడుతూ ఎవరికైతే నచ్చుతారో వారి ముందు ఉన్న జార్లలో గ్రీన్ కలర్ వాటర్ ని పోయాలి అంటూ యాంకర్ శ్రీముఖి అక్కడున్న వారందరికీ ఫిట్టింగ్ పెట్టగా అందులో యశ్మి గౌడ, ముఖేష్ గౌడ దగ్గర ఉండే బాటిల్లో గ్రీన్ కలర్ పోస్తుంది.. అంతేకాకుండా చూడడానికి బాగున్నాడు మంచిగా మాట్లాడుతున్నారు అతని లుక్ హైలెట్ గా ఉందంటూ ముఖేష్ గౌడ పైన యస్మి గౌడ చేసిన కామెంట్స్ హైలెట్గా నిలుస్తున్నాయి అయితే నిఖిల్ పక్కన ఉండగానే ముఖేష్ గౌడ నచ్చడంతో ఒకసారిగా నిఖిల్ సైలెంట్ అయ్యారు. అలాగే తనకు టేస్టీ తేజ నచ్చాడు అంటే ప్రిన్సి చేసిన రచ్చ మామూలుగా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: