బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్  కు ప్రజలలో కూడా బాగానే క్రేజ్ లభిస్తూ ఉన్నది. దీంతో సోషల్ మీడియాలో కూడా ఫాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ షో ద్వారా చాలామంది కూడా పాపులర్ అయిన వారు ఉన్నారు. గత ఏడాది తెలుగు బిగ్ బాస్ 8 సీజన్ కి సంబంధించి ఎండ్ కార్డు కూడా పలికింది. ఇందులో చాలా మంది బుల్లితెర సెలబ్రిటీలతోపాటు సామాన్యులు కూడా ఇందులో కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చి బాగానే క్రేజ్ సంపాదించారు. రాయలసీమలో నంద్యాలలో పుట్టిన కిర్రాక్ సీత  కూడా ఒకరు. ఈమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ ఉద్యోగరీత ఎక్కువగా హైదరాబాదులోనే ఉన్నారట.


చదువులో చిన్నప్పటి నుంచి యాక్టివ్గానే ఉండే కిర్రాక్ సీత ఈమెకు కూచిపూడి, భరతనాట్యం అంటే చాలా ఇష్టమట. అందులో మంచి ప్రావీణ్యం కలదట. అందుకే చిన్న వయసు నుంచి తన పాకెట్ మనీ కోసం ఇమే కష్టపడుతూ పనిచేసేదట. ఇటీవలే యూట్యూబర్ గా మారి బోల్డ్ కంటెంట్ తో మరొకసారి దుమ్మురేపింది. అయితే ఈమె ఎలాంటి విషయాలు మాట్లాడినా కూడా కాస్త బోల్డ్ గానే మాట్లాడుతూ కుండబద్దలు కొట్టేస్తూ ఉంటుంది.


ఈ క్రమంలోని సీతకు సినిమాలలో అవకాశాలు లభించాయి. బేబీ సినిమాలో హీరోయిన్ ని చెడగొట్టి ఆమెకు చెడు వ్యాసనాలకు సైతం బానిస అయ్యే అమ్మాయిగా అద్భుతమైన పాత్రలో నటించినది కిర్రాక్ సీత. ఈ పాత్ర చేసిన తర్వాత తనను చాలామంది తిట్టారని కూడా కొంతమంది తనను రేప్ చేస్తామంటూ బెదిరింపులు కూడా చేశారని తెలియజేసింది. అయితే తన పాత్ర అలా ప్రజలలోకి వెళ్ళినందుకే తనని అలా అనుకుంటున్నారు తప్పా వారి గురించి తప్పుగా ఏమి అనుకోలేదని తెలిపింది. తన స్నేహితుడు కూడా పోలీసులకు ఈ విషయాన్ని చెప్పమన్న తాను చెప్పలేదని తెలిపింది.. అయితే తనకు మాత్రం ప్రతిరోజు టీ లేకుంటే ఉండలేనంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: