చాలామంది సెలబ్రిటీలు రాయల్ లైఫ్ జీవితాన్ని గడుపుతూ ఉంటారని వారు వేసుకుని దుస్తులు లగ్జరీ లైఫ్ని చూసి అనుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది ఎన్నో సీరియల్స్లలో సినిమాలలో నటించిన పెద్దగా సంపాదించుకొని ఏమి ఉండరు. అయితే ఇప్పుడు తాజాగా తెలుగు సీరియల్స్ లో గుర్తింపు పొందిన ప్రముఖ నటిమనులలో  ఒకరైనటువంటి రాగా మాధురి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమకు పేమెంట్స్ విషయంలో కాస్ట్యూమ్స్ విషయంలో జరిగే విషయాలను తెలియజేసింది.



ఏదైనా ఫంక్షన్ సన్నివేశాలు ఉన్న సమయాలలో మాత్రమే ఖర్చు తగ్గుతుందని తెలియజేసింది. ట్రావెలింగ్ కు వారు ఇచ్చే పేమెంట్ కంటే మరింత ఎక్కువ అవుతుందని తెలియజేసింది. తాను ఎన్నో నాటికలలో మదర్ రోల్స్ చేస్తున్నాను కాబట్టి తాను తీసుకున్న చీరలు భవిష్యత్తులో ఉపయోగపడని మా దగ్గర ఉన్న చీరలు ఎవరికైనా ఇచ్చేయాల్సిందే అంటూ తెలియజేసింది రాగా మాధురి.. అలా షాపింగ్ కి వెళ్ళినప్పుడు 20 నుంచి 50 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని. ఇలా నెలలో కనీసం ఒకసారైనా షాపింగ్ కు వెళ్లాల్సి ఉంటుందనే విధంగా వెల్లడించింది రాగా మాధురి.


జగదాద్రి సీరియల్ లో ఈమె నటించే సమయంలో 400 చీరలు ఉపయోగించానని ఆ చీరలన్నీ కూడా వేస్ట్ అంటూ తెలిపింది. వేరే ఆర్టిస్టులు ఆ చీరలు ఏం చేసుకుంటారో తెలియదని వెల్లడించింది.. కానీ బెంగాలీ, తమిళ, కన్నడ వంటి వారు ఇక్కడ ఎక్కువగా పని చేస్తున్నారని వారికి ఇచ్చే రెమ్యూనరేషన్ తో పోలిస్తే తమకు చాలా తక్కువగా ఇస్తారని తెలియజేసింది నటి రాగా మాధురి. అయితే వారందరూ ఎక్కువగా షూటింగ్లో పాల్గొంటూ ఉంటారని ప్రొడ్యూసర్లు తెలిపారని తెలిపింది. మేము కొన్ని సీన్స్ విషయంలో కచ్చితంగా కండిషన్స్ ఉంటాయని తెలిపింది..అయితే ఈ ప్రొఫెషన్ పైన ఎక్కువ కాలం జీవించడం చాలా కష్టమని తెలిపింది రాగా మాధురి. ఇక్కడ ఇన్కమ్ కంటే వేస్టేజ్ ఖర్చు ఎక్కువగా ఉందని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: