బిగ్ బాస్ ద్వారా మంచి పాపాలరిటి సంపాదించు కున్నటువంటి వారిలో దివి కూడా ఒకరు.. ఇమే చదువుకునేటప్పుడు మోడల్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించి బిగ్ బాస్ ద్వారా భారీ క్రేజీ సంపాదించుకుంది. అలా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో హైప్ పెంచుకొని పలు సినిమాలలో అవకాశాలను అందుకుంటోంది. దివి హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఉన్నది. ఇటీవలె ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తన కుటుంబం గురించి తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి వెల్లడించింది.



దివి మాట్లాడుతూ తాను బీటెక్, ఎంటెక్ పూర్తి చేశానని తెలిపింది.. తనకు జాబ్ ఇష్టం లేదని తను కవితలు కూడా రాస్తానని తెలియజేసింది. తన సొంత కాళ్ల మీదే తాను బతకాలనుకున్నానని అందుకే చదువు పూర్తి అయిన తర్వాత.. తన కాలేజీలో వారే తనకు లెక్చరర్ ఉద్యోగం పిలిచి ఇచ్చారని ఒక సబ్జెక్టులో గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారని తెలిపింది. తన కుటుంబం గురించి చెబుతూ తన తల్లితండ్రులు అందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులే అని వెల్లడించింది.


తన తల్లి, అన్న ఇద్దరు కూడా ప్రొఫెసర్ అని తాను కూడా మొదట టీచింగ్ జాబ్ కి వెళ్లాలనుకున్నానని కానీ తనకి అది నచ్చకపోవడంతో వదిలేసానని తెలిపింది. బిగ్ బాస్ షో కి వచ్చే వరకు తనని ఇంట్లో కుటుంబ సభ్యులు తిట్టేవారని తను ఏ పని చేయట్లేదని.. కేవలం నిద్రపోతూ ఉంటారని తిడుతూ ఉండేవారిని తెలిపింది.. అలాగే ఆడిషన్స్ కి కూడా కేవలం ఆటోలోనే వెళ్లే దాన్ని అంటూ తెలిపారు. కొన్ని సందర్భాలలో ఇంటిలో నుంచి వెళ్ళిపొమ్మని కూడా తిట్టేవారని కానీ కొన్నిసార్లు సపోర్ట్ చేశారని తెలిపింది. ఇటీవలే ఈమె డాకు మహారాజ్, పుష్ప 2 వంటి చిత్రాలలో కూడా నటించింది. తన కాలికి గాయం అవ్వడం చేత కొన్ని షూటింగ్లలో పాల్గొనలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: