బుల్లితెరపై ఫేమస్ నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో టీనా దత్త కూడా ఒకరు.. ఈమె మొదట చైల్డ్ యాక్టర్  గా తన కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత సీరియల్స్ లో కూడా నటించి స్టార్ డమ్ సంపాదించుకున్నది.. ఈమె సీరియల్స్  వల్ల ఎన్నో టిఆర్పి రికార్డులను కూడా బద్దలు కొట్టేసిందట. ఇప్పటికీ ఒంటరిగా తన జీవితాన్ని గడిపేస్తున్న టీనా దత్త.. తాజగా ప్రేమ ,పెళ్లి, పిల్లలు గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.


ముఖ్యంగా టీనా దత్త మాట్లాడుతూ.. తనకు మింగిల్ అయ్యే ఉద్దేశం లేదని తన ఫ్యూచర్ ప్లానింగ్ గురించి మాట్లాడడం జరిగింది. ఒంటరిగా తల్లి కావడానికి తనకు ఎలాంటి అభ్యంతరం కూడా లేదని వెల్లడించింది.. ప్రస్తుతానికైతే తాను వివాహం చేసుకోకుండానే ఎవరితోనైనా తల్లిగా అవ్వాలని  ఆలోచిస్తున్నానని వెల్లడించింది. ఈ సమయంలోనే తాను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదని కానీ భవిష్యత్తులో మాత్రం దత్తత తీసుకోవడం లేదా అద్దెగర్భం వల్ల తల్లి కావాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించింది. తాను తల్లిగా మంచి పేరు సంపాదించుకుంటానని నమ్మకం తనకు ఉందని తెలిపింది టీనా.

ప్రస్తుతమైతే తాను ఎలాంటి విషయాలు గురించి ఆలోచించలేదు. తాను ఎలాంటి ప్రణాళికలు చేయలేదని కానీ సరైన సమయం వచ్చినప్పుడు తాను మంచి తల్లిగా నిరూపించుకుంటానని వెల్లడించింది టీనా దత్త. సరోగసి ద్వారా అయినా పిల్లలు కంటానని తెలిపింది. తనకు ఇష్టమైన హీరోయిన్ సుస్మితసేన్ కి కూడా తాను  ఆమెకు ఇద్దరు కూతుర్లను దత్తత తీసుకున్నది. తాను కూడా అలాంటి పని చేస్తానని తెలియజేసింది. ఈ నిర్ణయానికి తన తల్లిదండ్రులు మద్దతు కూడా ఉంటుందని తెలిపింది. తన కుటుంబాన్ని ఒంటరిగా చూడగలిగితేనే తన పిల్లలను కూడా ఒంటరిగా చూసుకోవచ్చని వెల్లడించింది టీనా. తనను తాను చూసుకోవడానికి భర్త అవసరము లేదని కూడా వెల్లడించింది. పిల్లలు బాధ్యత తీసుకోవడానికి కూడా భర్త సహాయం అవసరం లేదని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: