తెలుగు బుల్లితెర పైన బిగ్ బాస్ షో మొదలైంది అంటే చాలు ఎంతోమంది ఆదరిస్తూ ఉంటారు. అయితే వీటి ద్వారా చాలామంది సెలబ్రిటీలుగా మారిన వారు కూడా ఉన్నారు. సెలబ్రిటీలు కూడా ఇందులో ఎంట్రీ ఇచ్చి సినిమా అవకాశాలు సీరియల్ అవకాశాలను కూడా సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ఇనయా సుల్తానా కూడా ఒకరు.. ఈమె బిగ్ బాస్ లో ఆడ పులి అన్నట్లుగా ప్రేక్షకులను అలరించి బాగానే అభిమానులను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ తాజాగా ఒక పోస్ట్ ని సైతం అభిమానులకు షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.



ఇనయా చిత్తూరు జిల్లాకు చెందిన అమ్మాయి అయినప్పటికీ చిన్న వయసు నుంచి నటి కావాలని కోరికతో ఉండేదట. తల్లిదండ్రులు ఇంటి నుంచి బయటకు పంపించేవారు కాకపోవడంతో చివరికి ఇంటి నుండి తప్పించుకొని తన సంకల్పాన్ని నెరవేర్చడం కోసం  ఇంటి నుంచి 100 రూపాయలు తీసుకొని పారిపోయి తిరుపతికి వెళ్లి బస్సు ఎక్కి తన స్నేహితులు తెలిసిన వారి సహాయంతో చిన్న ఉద్యోగం తిరుపతిలోని చేస్తూ తన కల నెరవేర్చుకోవడానికి హైదరాబాద్ కి వచ్చిందట.


చిన్నచిన్న క్యారెక్టర్లలో నటిస్తూ హాస్టల్లోనే ఉంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుండేదట.. అలా బుజ్జి ఇలా రా, నవరత్నాలు, ఏవం జగత్ తదితర సినిమాలలో కూడా నటించింది. ఆ తర్వాత వర్మతో కలిసి ఒక పార్టీలో హడావిడి చేయడంతో ఒక్కసారిగా ఈమె పేరు వైరల్ గా మారింది. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా అవకాశం రావడంతో మరింత క్రేజీ సంపాదించుకుంది. హౌస్ నుంచి బయటికి వచ్చాక సినిమాలు, వెబ్ సిరీస్లలో నటిస్తున్న ఇమే ఒక వ్యక్తితో ప్రేమలో మునిగి తేలింది. అతని పేరు గౌతమ్.. అతను కూడా ఒక జిమ్ ట్రైనర్ అప్పుడప్పుడు ప్రియుడుతో కలిసి విహారయాత్రకు వెళ్తూ ఉంటుంది ఇనయా.తాజాగా ఒక పోస్ట్ షేర్ చేస్తు జీన్స్ ప్యాంటు బ్లూ కలర్ టీ షర్టు ధరించి డ్రైవింగ్ చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ జీవితం బాగా కష్టంగా ఉన్నది..కానీ ధైర్యంగా ఉండాలని.. ప్రతి నెల గడవడం కూడా చాలా కష్టంగా ఉందని.. తెలియజేస్తూ మరొకసారి న్యూ ఇయర్స్ శుభాకాంక్షలు తెలియజేసింది ఇనయా.. ఈ విషయం తెలిసి అభిమానులు నటిజన్స్ ఆశ్చర్యపోయి ఏమైంది ఇనయా అంటూ ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: