ఈ మధ్యకాలంలో ఓటీటీలలో కూడా పలు రకాల డ్యాన్స్ షోలు కామెడీ షోలు తెగ హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఆహాలో ఎక్కువగా వీటి హవా కనిపిస్తూ ఉన్నది. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి వైల్డ్ ఫైర్ అనే ఒక ట్యాగ్ తో ఒక షో రాబోతోంది. ఇందుకు యాంకర్ గా ఓంకార్ చేస్తూ ఉన్నారు. అయితే శేఖర్ మాస్టర్ ఫరియా అబ్దుల్లా జడ్జిగా వ్యవహరిస్తున్నట్టు తాజాగా విడుదలైన ప్రోమోలో కనిపిస్తోంది. ఇందులో కొంతమంది సీరియల్ యాక్టర్స్ తో పాటుగా జబర్దస్త్ యాక్టర్స్ కూడా కనిపించారు.


సీరియల్లో నటించిన దీపిక రంగరాజు, మానస్, ప్రగతి కంభం, ఝాన్సీ, కొరియోగ్రాఫర్ యశ్వంత్, తదితరులు ఇందులో కనిపించారు. ప్రోమో రిలీజ్ చేయగా ఈ ప్రోమో లో దీపికా రంగరాజు కాస్త ఓవర్ యాక్షన్ గా బోల్డ్ డైలాగులతో రెచ్చిపోయినట్టు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా దీపిక దెబ్బకి శేఖర్ మాస్టర్ కూడా దండం పెట్టే పరిస్థితి వచ్చేసింది. వాస్తవానికి దీపిక రంగరాజుకి అసలు డ్యాన్స్ ఏ రాదు కానీ డాన్స్ ఐకాన్ 2 కి  తీసుకురావడం జరిగింది.. దీంతో దీపిక ఒక పర్ఫామెన్స్ అయితే చేసింది.. దీనికి మరీ ఓంకార్ ఏకంగా చాక్లెట్ ఇవ్వడం జరిగింది దీపికాకు.


 ఆమె ఆ చాక్లెట్ నోట్లో పెట్టుకొని మరి శేఖర్ మాస్టర్ దగ్గరికి వెళ్లి లిఫ్టు లిఫ్ట్ చాక్లెట్ ఇవ్వాలని ఆఫర్ చేయగా ఇది చూసిన శేఖర్ మాస్టర్ ఒక్కసారిగా నా కొంప కూల్చకు తల్లో అంటూ కుర్చీలో నుంచి లేచి పరిగెత్తారు.. మానస్ తన డ్యాన్స్ తో అదరగొట్టేశారు. ఆ తర్వాత యశ్వంత్ మాస్టర్ కూడా తనదైన స్టైల్ లో అదరగొట్టేశారు. ఇలా వీరే కాకుండా చాలా మంది తమ డాన్స్ తో ఆకట్టుకున్నప్పటికీ జబర్దస్త్ రోహిణి తన విభిన్నమైన యాక్టింగ్ తో కడుపుబ్బ నవ్వించింది. మొత్తానికి ఈ ప్రోమో వైరల్ అవుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: