తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో జరిగిన విషయాలను కూడా వెల్లడించింది. మొదట బిగ్బాస్ కు మోడల్ గానే తనని సెలెక్ట్ చేశారని కానీ తనని సెలెక్ట్ చేయడానికి 4 ఇంటర్వ్యూలు చేశారు..అప్పుడు తన మీద తనకి కాన్ఫిడెంట్ ఉన్నదని అన్ని ఓకే అయ్యి సెలెక్ట్ చేశారని తెలిపింది. గతంలో కూడా ఒకసారి బిగ్ బాస్ హౌస్ లో రావడానికి అవకాశం ఒప్పుకోలేదని తెలిపింది.
అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ఉదయం తనకు చాలా టెన్షన్ గా అనిపించిందని తన అమ్మకి ఫోన్ చేసి ఏడ్చేసానని ఎందుకంటే అప్పుడు కరోనా సమయం కాబట్టి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అని భయపడ్డాను అని తెలిపింది. అప్పటివరకు తాను ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని హౌస్ లోకి వచ్చిన తర్వాత కొన్ని లక్షల రూపాయలు సంపాదించానని తెలిపింది. హౌస్ లో అందరూ చేసేటువంటి రచ్చ తనకి విసుగు తెప్పించేలా చేసిందని తెలిపింది. నాగార్జున గారు తనకి మొదటి నుంచి ఎక్కువగా సపోర్ట్ చేసేవారని అయితే తను దసరాకి ఎలిమినేట్ అయ్యానని కానీ ఆ రోజున నాగార్జున హోస్ట్ గా లేకపోవడంతో సమంత వచ్చింది..సమంత వల్లే తాను ఎలిమినేట్ అయ్యానని తెలిపింది దివి. ఒకవేళ నాగార్జున గారు ఉండి ఉంటే మరికొన్ని రోజులు ఉండేదాన్నేమో అన్నట్టుగా వెల్లడించింది. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.