తెలుగు బుల్లితెర పైన యాంకర్ గా మంచి క్రేజీ సంపాదించుకున్న వారిలో రష్మీ గౌతమ్ కూడా ఒకరు.. బుల్లితెర పై ఎన్నో షోలు చేసిన ఈమె పలు చిత్రాలలో హీరోయిన్గా నటించింది.. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా రష్మీ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు సుధీర్.. తన కామెడీ డైలాగులతో జబర్దస్త్ లో బాగా అలరించిన సుధీర్ ఒక్కసారిగా క్రేజ్ పెరగడంతో సినిమాలలో కూడా బాగానే అవకాశాలు వచ్చాయి. కానీ వచ్చిన అవకాశానన్న ఉపయోగించుకోలేకపోయినా సుదీర్ హీరోగా ఫెయిల్యూర్ అవ్వడంతా తిరిగి మళ్ళీ బుల్లితెర పైకి రావడం జరిగింది.


అయితే బుల్లితెర మీదికి వచ్చిన సుధీర్, రష్మీ జంటకు అప్పుడున్నంత క్రేజ్ రాలేదు. గతంలో సుధీర్, రష్మికి ఎన్నోసార్లు స్టేజి మీద పెళ్లి కూడా చేశారు. అలా ఎన్నోసార్లు వీరిమధ్య ఏదో ఉందని రూమర్స్ సృష్టించినప్పటికీ.. కేవలం తాము ఆన్ స్క్రీన్ మాత్రమే కలిసి కనిపిస్తూ ఉంటాము ఆఫ్ స్క్రీన్ లో తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని కూడా తెలియజేశారు. అయితే కేవలం టిఆర్పి స్టంట్ లు కోసమే రష్మీ ,సుధీర్ మధ్య ఏదో ఉందన్నట్టుగా చూపిస్తూ ఉంటారు.


గతంలో వీరిద్దరూ ఎన్నో షోలు చేసిన టిఆర్పి రేటింగ్ విషయంలో టాప్ లో ఉండేదట. కానీ ఈమధ్య కొంతమేరకు బెడిసి కొట్టిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఒక షోలో రష్మీ లవర్స్ డే సందర్భంగా స్పెషల్గా ఈ షో చేశారు.. ఇందులో తన మనసులో ఉన్న వారి పేరు గురించి బోర్డు మీద రాయాల్సి ఉండగా.. రష్మీ S  అనే అక్షరం రాయడంతో అందరూ కూడా సుదీర్ పేరే అని భావించారు. అంతేకాకుండా ప్రోమో కూడా కట్ చేయడంతో ఈ ప్రోమో పై నేటిజన్లు ఫైర్ అవుతున్నారు.. ఇలాంటి టిఆర్పి రేటింగ్ స్టాండ్స్ చాలానే చూశాము ఇలాంటి వాటిని అసలు నమ్మొద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: