సినిమాలలో పాత్ర నచ్చితే చాలు భాషతో సంబంధం లేకుండా చాలామంది నటీనటులు ఇండస్ట్రీలలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలా 2023లో చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమయ్యాడు హీరో బాబి సింహ. అందులో తను నటించిన పాత్రకి మంచి పేరు లభించింది. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీ అయిపోయిన బాబి సింహ అప్పుడప్పుడు విలన్ గా, హీరోగా పలు రకాల కీలకమైన పాత్రలలో కూడా నటిస్తూ ఉన్నారు. తన డబ్బింగ్ సినిమాలను కూడా తెలుగులో విడుదల చేస్తూ ఉంటారు బాబి సింహ.



నిజానికి బాబీ సింహ సికింద్రాబాద్ లో పుట్టి పెరిగినప్పటికీ కొంతకాలానికి కుటుంబంతో కలిసి కొడైకెనాల్ కి వెళ్లిపోయి అక్కడే చదువుకున్నారట.. అయితే తను చదువుకుంటున్న సమయంలోనే నటన పైన ఆసక్తి ఉండడంతో కుటుంబ పోషణ కోసం మార్కెటింగ్ పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బుతో పోషించే వారట.. 2007లో తమిళ సినిమా ద్వారా తన సినీ కెరీర్ ని మొదలుపెట్టిన బాబి సింహ తన నటనతో ప్రశంసలు అందుకునేలా చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళ్ ,కన్నడ, మలయాళం వంటి భాషలలో కూడా బిజీ నటుడుగా మారిపోయారు.


బాబి సింహాకి కూడా ఒక చెల్లెలు ఉన్నదట.. ఈమె ఒకప్పుడు యాంకర్ గా చేసి, ఆ తర్వాత పలు తమిళ్ టీవీ షోలలో కూడా పలు రకాల ప్రోగ్రాములు చేసి మంచి పాపులారిటీ రావడంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిందట. బాబీ సింహ చెల్లెలు.. ఈమె పేరు రేష్మ పసుపులేటి.. ఈమె తమిళ బిగ్ బాస్-3 లో  పాల్గొన్నదట. ఈమెకు తెలుగులో తక్కువ క్రేజ్ ఉన్నప్పటికీ తమిళంలో బాగానే ఉన్నది తెలుగులో ఆనంద్ దేవరకొండ తో కలిసి హైవే అనే చిత్రంలో నటించిందట. సోషల్ మీడియాలో కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నట్లు సమాచారం. మరి తెలుగులో కూడా తన అన్నలాగా అలరిస్తుందేమో రాబోయే రోజుల్లో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: