బుల్లితెర పైన ఎంతమంది నటీమణులు భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో మేఘా మహేష్ కూడా ఒకరు.. ఈమె మొదట మోడల్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత చైల్డ్ యాక్టర్ గా వధు అనే సీరియల్ ద్వారా పరిచయమైందట. ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా నటించిన ఈ అమ్మడు మిజీ అనే సీరియల్ లో కూడా నటిస్తోంది. ఇక ఈమె పర్సనల్ విషయానికి వస్తే గత కొంతకాలంగా మౌనరాగం2 సీరియల్  నటుడు సల్మానుల్ తో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.


అయితే ఈ విషయం పైన ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా క్లారిటీ ఇవ్వలేదు.. కానీ వీరి వివాహం కూడా త్వరలోనే జరగబోతుంది అనే విధంగా వార్తలు వినిపిస్తున్న తరుణంలో తాజాగా మేఘా మహేష్ తన రిలేషన్షిప్ పైన ఒక క్లారిటీ ఇస్తూ తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక విషయాన్ని వెల్లడించింది. అదేమిటంటే మేమిద్దరం కలిసి జీవితంలో ముందుకు ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నాము అంటూ తెలియజేసింది. అలాగే ఆనందం, ప్రేమ ,జాగ్రత్త, ఒడిదుడుకులు, దుఃఖం అన్ని విషయాలను తమ జీవితంలో  చిరస్థాయిగానే పంచుకోవాలనుకుంటున్నామంటూ తెలియజేసింది.



తమకు ఎప్పుడు మద్దతుగా నిలిచేటువంటి అభిమానులకు, ప్రేక్షకులకు  కూడా కృతజ్ఞతలు అంటూ ఒక పోస్ట్ ని రాసుకుంది. నటుడు సల్మానుల్ తో దిగినటువంటి ఒక ఫోటోను సైతం షేర్ చేస్తూ క్లారిటీ ఇచ్చింది. దీంతో మేఘ మహేష్ అభిమానుల సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఇక పెళ్లి తేది మాత్రం వెల్లడించలేదు.. కానీ ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. మరి కొంతమంది మాత్రం ఎన్ని రోజులు సైలెంట్ గా ఉండి ఇలా సడన్ ట్విస్ట్ ఇచ్చావ్ ఏంటి మేఘా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి వివాహ తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: