![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/tv/122/ashu-reddy-sarjary-clearty-fans-happy-trolld88fdc4b-df27-4928-bf2d-a8c77c140f27-415x250.jpg)
ఆ తర్వాత బిగ్ బాస్ లో రెండుసార్లు ఎంట్రీ ఇచ్చిన కూడా గెలవలేకపోయింది. బిగ్ బాస్ 3లో మాత్రం తన అంద చందాలతో హౌస్ లో గ్లామర్ గర్ల్ గా పేరు సంపాదించింది. కేవలం 5 వారాల పాటే కొనసాగిన ఈ అమ్మడు ఆ తర్వాత బిగ్ బాస్ ఓటిటిలో కూడా అవకాశం వచ్చిన 10 వారాలపాటు కొనసాగింది తప్ప విన్నర్ కాలేక పోయింది. దీంతో ఈ మధ్యకాలంలో సినిమాలలో నటిస్తున్నట్టుగా పలు రకాల ఫోటోలను షేర్ చేసింది. గతంలో చల్ మోహన్ రంగ అనే సినిమాలో నటించింది.
ప్రస్తుతం ఏ మాస్టర్ పీస్ అనే చిత్రంలో నటిస్తోందట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని ఎప్పటికప్పుడు ఆయన పైన అభిమానాన్ని చూపిస్తూ పలు రకాల ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పవన్ పెరును సీక్రెట్ ప్లేస్ లో కూడా వేసుకుంది అషు రెడ్డి. అందుకే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈమెకు సపోర్టు చేస్తూ ఉంటారు.. గత కొంతకాలంగా అషు రెడ్డి తన ముఖానికి సర్జరీ చేయించుకుందని దీనివల్ల ట్రోలింగ్ బారిన కూడా అషు రెడ్డి పడడం జరిగింది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తాను ఎలాంటి సర్జరీలు సైతం చేయించుకోలేదని కేవలం అదంతా రూమర్సే అంటూ వెల్లడించింది.