బిగ్ బాస్ షో వల్ల భారీ పాపులారిటీ సంపాదించుకున్న వారిలో ఇనయా సుల్తానా కూడా ఒకరు.. బిగ్బాస్ ఆరో సీజన్ లో ఇమేజ్ చేసిన రచ్చ గురించి చెప్పాల్సిన పనిలేదు మొదట డల్లుగా కనిపించిన ఆ తర్వాత టైటిల్ రేసులో నిలవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అనుకోకుండా ఎలిమినేట్ అయినప్పటికీ కూడా బిగ్ బాస్ షో తో భారీ క్రేజీ సంపాదించుకుంది ఇనయా.. ఆ తర్వాత పలు చిత్రాలలో అవకాశాలను అందుకుంది ఇటీవలే బచ్చలమల్లి అనే సినిమాలో కూడా నటించింది.


ఇప్పుడు తాజాగా మదం అనే ఒక సినిమాలో కూడా నటిస్తోంది. డైరెక్టర్ వంశీకృష్ణ మల్ల డైరెక్షన్ వహించగా ఈ సినిమా మార్చి 14న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర బృందం టీజర్ ని కూడా విడుదల చేయగా అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఈ సినిమా స్టోరీ ఫారెస్ట్ నేపథ్యంలో ఒక విలేజ్ లవ్ స్టోరీ ల కనిపిస్తోంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు వైలెన్స్ ప్రేమ పోరాటాలు ఇందులో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా టీజర్ చాలా కొత్తగా కనిపిస్తోందని కూడా చెప్పవచ్చు.


నిర్మాత రమేష్ కూడా మాట్లాడుతూ ఈ సినిమా కథ విన్నప్పుడు మొదట భయం వేసింది. తెలుగులో ఇలాంటి సినిమా రావడం చాలా అరుదు అంటూ తెలిపారు క్లైమాక్స్ ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీ లోనే లేని సినిమా ఉంటుంది అంటూ తెలిపారు. ఇనయా సుల్తానా మాట్లాడుతూ.. తనకు నెగిటివ్ పాత్రలు చేయడం అంటే చాలా ఇష్టమని అందుకే మనం చిత్రంలో తాను ఇంపార్టెంట్ పాత్రలో నటించాను. చాలా క్లిష్టమైన పరిస్థితులలో డైరెక్టర్ తనకి చాలా సపోర్టుగా నిలిచారని అందుకే తాను బాగా నటించగలిగానని తెలిపారు. ఇందులో నటించిన లత, హర్ష చాలా రియలిస్టిక్ గాని నటించారని ఈ సినిమా అద్భుతంగా వచ్చిందని తెలిపారు. మరి మొత్తానికి నెగిటివ్ పాత్రలతో ఇనయా సక్సెస్ అవుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: