![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/tv/122/anasuya-ram-charn-movie-buchibabu-sana63fb6404-2b47-4ba8-83ff-3eceac2d3918-415x250.jpg)
ఆ చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్న అనసూయ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాతో ఈమె కెరియర్ మలుపు తిరిగిందని చెప్పవచ్చు.. ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన మూడు చిత్రాలలో కూడా అనసూయ నటించిన. ఇప్పుడు డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు తీస్తున్న బుచ్చిబాబు సన డైరెక్షన్లో కూడా అనసూయ క్రేజీ ఆఫర్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హీరో రామ్ చరణ్ తో బుచ్చిబాబు తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు ఈ సినిమా కోసం సుమారుగా కొన్ని నెలల పాటు వెయిట్ చేస్తూనే ఉన్నారు.
ఇప్పుడు మరొకసారి అనసూయ రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమైనట్లుగా టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో కూడా రంగస్థలం సినిమాలోని పాత్ర అనసూయకి పడబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి సుకుమార్ కాంపౌండ్ నుంచి అనసూయ బయటపడడం లేదని అలాగే కంటిన్యూ అవుతూ సినిమాలు చేస్తోందని అభిమానులు తెలియజేస్తున్నారు. గతంలో కూడా రామ్ చరణ్, అనసూయ మధ్య వచ్చిన సన్నివేశాలు సినిమాకి భారీ క్రేజీ తీసుకువచ్చాయి. ఇప్పుడు కూడా మళ్లీ అలాంటి తరహాలోనే మ్యాజిక్ రిపీట్ అవుతుందని అభిమానులు కూడా వెల్లడిస్తున్నారు. రామ్ చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తూ ఉండగా ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.