చాలామంది సెలబ్రిటీలే కాకుండా ప్రజలు కూడా వయసుతో సంబంధం లేకుండా ప్రేమించుకొని మరి పెళ్లి చేసుకుంటున్నారు. చాలామంది వివాహమై విడిపోయినప్పటికీ  మనవల్లతో ఆడుకునే సమయాలలో పెళ్లి చేసుకుంటున్నారు. గడిచిన కొన్ని నెలల క్రితం మలయాళ నటుడు క్రిష్ వేణుగోపాల్, నటి దివ్య శ్రీధర్ వివాహం చేసుకోవడంతో చాలామంది వీరి పైన ట్రోలింగ్ చేయడం జరిగిందట.. దివ్యనీ చాలామంది ఆస్తి కోసమే వివాహం చేసుకున్నది అంటూ.. పెళ్లయిన మూడు నెలలైనా మీరు కలిసి ఉంటారా అంటూ చాలామంది ట్రోలింగ్ చేశారట. చాలామంది ఈమెను తిట్టిపోశారట. అయితే ఈ విషయాలను సైతం తిప్పికొడుతూ పలు విషయాలను తెలియజేసింది.

గత ఏడాది నవంబర్లో అగ్నిసాక్షిగా ఒక్కటైన ఈ జంటపై .. మాట్లాడిన మాటలపై దివ్య ఇలా మాట్లాడుతూ.."ముసలోడిని చేసుకున్నదని అన్నారు.. ఇప్పుడు విడిపోతున్నారా అంటూ ప్రచారం చేశారు.. మేము ఎవరి జీవితాల్లోకి తొంగి చూడట్లేదు ఎవరికి ఎలాంటి హాని కూడా చేయలేదని మరెందుకు మా జీవితాల మీద ఇలా ఇష్టానుసారంగా వార్తలు రాస్తున్నారంటూ ఫైర్ అయ్యింది దివ్య శ్రీధర్.. ఎవరికి నచ్చినట్టుగా వారు ఏవేవో కథలు రాసేసుకుంటూ ఉన్నారు. మా జంట మీకు నచ్చకపోతే మమ్మల్ని వదిలేయండి ఎవరు కూడా చెత్త కామెంట్స్ చేయకండి అంటూ తెలిపింది. అలాగే తమను ప్రేమిస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు అంటూ తెలిపింది".


అలాగే తన భర్త తన కోసం లిప్ స్టిక్, చాక్లెట్లు వంటివి ఇస్తున్నారని ప్రేమికుల రోజు దగ్గర ఉండడంతో ఆయన చాలా బహుమతులు ఇస్తున్నాడని అవన్నీ మీకు చూపించాలని తన సంతోషాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను కానీ ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని తెలియజేసింది.. ఈ విషయం విని తనకు చాలా బాధ వేసిందని మేము కలిసే ఉంటున్నాము జీవితంలో ఇంత ప్రేమ తాను ఎప్పుడూ పొందలేదని తెలిపింది నటి దివ్య శ్రీధర్. వేణుగోపాల్, దివ్య ఇద్దరు కూడా పాతర మట్టు అనే సీరియల్ లో కలిసి నటించారట. వీరిద్దరు పలు సీరియల్స్ లో కలిసే నటించడంతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. దివ్యశ్రీ విలనిజం పాత్రలో నటించేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: