![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/tv/122/mandana-karimi-bigboys9-director-comments-viral6dc56f30-7cb5-4409-b550-d665df4bc183-415x250.jpg)
ఆ నటి ఎవరో కాదు బాలీవుడ్ రియాల్టీ షోలో పాటు పలు చిత్రాలలో నటిస్తూ ఉన్న నటి మందన కరిమి. ఈమె పూర్వికులు సైతం ఇండియాకు సంబంధించిన వారు కావడం చేత ఈమెకు ప్రత్యేకమైన అభిమానం ఉన్నదట. ఈమె ఎయిర్ హోస్ట్ గా కూడా ఉద్యోగం చేసేదని చివరికి పూర్తిగా తన ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసి ఇండస్ట్రీలోకి రావాలని డిసైడ్ అయ్యి మోడలింగ్ వైపుగా అడుగులు వేసిందట. అలా ఇండియాలో పాపులర్ అవ్వడంతో బిగ్ బాస్-9 సీజన్లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది.
ఈషోలో తన నటన బాగుండడంతో రన్నర్ గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ లాక్ అప్ అనే రియాలిటీ షోలో పాల్గొని తన వ్యక్తిగత విషయాలను కూడా వెల్లడించింది. అలాగే తన జీవితాన్ని మలుపు తిరిగిన ఒక సంఘటన గురించి చెప్పడంతో పాటుగా తన ఇండస్ట్రీలో ఎదురైన అనుభవాలను తెలిపింది.. ఒక డైరెక్టర్ చేతిలో మోసపోయి ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.. ఇండియాలో భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఒక డైరెక్టర్ తనని వివాహం చేసుకుంటారని నమ్మించాడని.. ఆ డైరెక్టర్ మహిళా హక్కుల కోసం పోరాడుతున్నానని చెప్పి.. తనతో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నాము..కానీ ప్రెగ్నెంట్ అయిన విషయం తెలియగానే ఇచ్చిన మాట తప్పి పెళ్లి వద్దని చెప్పి నా జీవితాన్ని నాశనం చేశారు.. ఈ విషయాన్ని కూడా తన భర్త దగ్గర చెప్పానని.. దీంతో తన భర్త తనని ఎన్నోసార్లు కూడా వేధించారని అలా తట్టుకోలేక విడాకులు ఇచ్చానని తెలిపింది నటి నందన కరిమి. అయితే డైరెక్టర్ పేరు మాత్రం చెప్పలేదు. ఈమె షారుఖ్ ఖాన్ ,సైఫ్ అలీ ఖాన్ తదితర హీరోలతో కూడా నటించింది.