![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/tv/122/jaberdast-venky-money-love-wife-marrige83cb3562-f5f7-4ba8-85d4-4abaf969a6ae-415x250.jpg)
జబర్దస్త్ షోలో వెంకీ మంకీ ఎక్కువగా మిమిక్రీ టైపులో కామెడీ చేస్తూ ఉంటారు. తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే వెంకీ తన భార్యతో కలిసి వాలెంటైన్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన భార్య పిల్లల్ని కూడా పరిచయం చేశారు. తన భార్య అక్కతో మంచి స్నేహబంధం ఉండేదని అలా వాళ్ళ ఇంటికి వెళ్లినప్పుడే ఆమె చెల్లెలిని లవ్ లో పడేసానని తెలియజేశారు. ఆమెను పడేయడానికి చాలా సార్లు తన ఇంటికి వెళ్లానని తెలిపారు వెంకీ మంకీ. అయితే పెళ్లి ప్రపోజ్ కూడా పది అంతస్తులు భవనం పైకి తీసుకువెళ్లి మరి ప్రపోజ్ చేశారంటూ తెలియజేశారు.
పెళ్లి కూడా హంగామా లేకుండా చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పగానే.. ఆమె కూడా తను అంటే ఇష్టం ఉండడంతో వెంటనే ఓకే చెప్పిందని ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు కూడా ఈ పెళ్లికి ఒప్పుకోవడంతో కేవలం ఒక్కరోజులోనే ఎలాంటి హడావిడి లేకుండా జరిగిపోయింది అంటూ తెలిపారు. తన భార్య తరఫున మాత్రం పెళ్లికి ఎవరూ రాలేదని తన కుటుంబ సభ్యులు మాత్రమే వచ్చారని తెలిపారు వెంకీ. ముఖ్యంగా వెంకీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పటికీ జబర్దస్త్ లో వచ్చే ఆ ఉద్యోగాన్ని వదిలేశారట. మొత్తానికి తన ప్రేమ వ్యవహారాన్ని ఇలాటిస్టుతో వెంకీ మంకీ తెలియజేశారు.