![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/tv/122/anchor-bhanu-boyfriend-introduction-photo-viralf200b5c9-aa41-4be2-82ad-8578e771c93f-415x250.jpg)
కానీ తన బాయ్ ఫ్రెండ్ ఫేస్ ను మాత్రం రివీల్ చేయలేదు. కేవలం వెనుక నుంచి చూపిస్తూ ఉన్నది. భాను ఈ ఫోటోలు చూసిన చాలామంది అభిమానులు నెటిజెన్స్ సైతం ఈమెకు కంగ్రాజులేషన్స్ తెలియజేస్తూ ఉన్నారు. కానీ కమిట్మెంట్ చెప్పే ధైర్యం ఉన్నప్పుడు మరి లవర్ ఫోటో చూపించవచ్చు కదా అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి యాంకర్ భాను బాయ్ ఫ్రెండ్ అసలు ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్త లేకపోతే ఎవరో అనే విషయం పైన అభిమానులు తెగ వెతికేస్తూ ఉన్నారు.
సోషల్ మీడియాలో క్రేజ్ పెరగడంతో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర షోలలో కూడా ఈమెకు అవకాశాలు వచ్చాయి అప్పుడప్పుడు ఈటీవీలో జరిగే ఫెస్టివల్ ఈవెంట్లలో కూడా కనిపిస్తూ ఉంటుంది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న భాను ట్రెడిషనల్ లుక్ లో కూడా అదిరిపోతూ ఉంటుంది. మరొకవైపు ఈటీవీలో ఫెస్టివల్ ఈవెంట్లో ఒక ఫోక్ సింగర్ కూడా ఈమెకు ప్రపోజ్ చేశారట. అయితే అదంతా హైలెట్ అయినప్పటికీ కేవలం టిఆర్పి స్టంట్ అన్నట్లుగా వార్తలు వినిపించాయి. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న భాను ఇప్పుడు ఒకసారిగా కమిటీ అంటూ పోస్ట్ పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి తన బాయ్ ఫ్రెండ్ ఫేస్ ని ఎప్పుడు రివీల్ చేస్తుందో చూడాలి.