
యాంకర్ ఇలా ప్రశ్నిస్తూ.. జబర్దస్త్ నుంచి తీసేసారా లేదంటే మీరే మానేశారా అని ప్రశ్నించగా.. అందుకు సిరి హనుమంత్.. జబర్దస్త్ అంటే షోలో తాను ఎందుకు మానేస్తానని వాళ్లే తీసేసారంటు తెలిపింది. కానీ వారు ఎందుకు తీసేసారు అర్థం కాలేదు.. ఈ విషయాన్ని వారిని అడగగా.. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లేకుండా ఒకటే చేస్తామని ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈ రెండు నడిపించడం కుదరదని చెప్పారట. వారే అలా చెబితే ఇక నేనేమి చేస్తాను అంటూ అందుకే జబర్దస్త్ నుంచి వచ్చేసానని తెలిపింది సిరి హనుమంత్.
ఇటీవలే తన ప్రియుడుతో కలిసి వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సిరి హనుమంత్ అవకాశాలు వస్తే ఖచ్చితంగా తన సినిమాలలో కూడా నటించడానికి సిద్ధమే అంటూ వెల్లడించింది. అలాగే స్టార్ మా లో ప్రసారమైనటువంటి ఉయ్యాల జంపాల, సావిత్రమ్మ గారి అబ్బాయి తదితర సీరియల్ లో కూడా నటించింది. ఇక సినిమాల విషయానికి వస్తే ఒరేయ్ బుజ్జిగా, బూట్కట్ బాలరాజు తదితర చిత్రాలలో నటించింది. వాస్తవానికి సిరి హనుమంతు కూడా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ప్రాంతానికి చెందిన అమ్మాయి. ఈమె చదువుకుంటున్న రోజులలో సమయం దొరికినప్పుడు లోకల్ న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్గా కూడా పని చేసిందట. ఆ తరువాతే హైదరాబాద్ కి వచ్చి పలు రకాల న్యూస్ చానల్లో పనిచేసింది.