
తన బాయ్ ఫ్రెండ్ పక్కన నిలబడి మరి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ ముఖ్యంగా కసి కసి చూపులతో తన ప్రియుడిని సైతం మంత్రముగ్ధుల్ని చేసేలా ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లు కనిపిస్తోంది.. అయితే ఈ ఫోటోలకు" కండలు నీవి.. కటింగ్స్ నావి అన్నట్టుగా ప్రియాంక జైన్ ఫోటోలను షేర్ చేసింది".. ఈ ఫోటోలు చూసిన ప్రియాంక జైన్ అభిమానులు.. మీ బాయ్ ఫ్రెండ్ ని హీరో చేయొచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సిక్స్ ప్యాక్ బాడీ తో తన బాయ్ ఫ్రెండ్ తో రచ్చ రేపుతోంది ప్రియాంక జైన్ .వీరిద్దరూ గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తూ ఉన్నారట త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి.
శివకుమార్ కూడా తమిళ సినిమాలలో నటిస్తూ ఉన్నారని తెలుస్తోంది. అలాగే నిన్ను కోరి సీరియల్ లో ప్రస్తుతం అయితే శివకుమార్ నటిస్తూ ఉన్నారట. ప్రియాంక జైన్.. జానకి కలగనలేదు, మౌనరాగం వంటి సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత బిగ్బాస్ లో అవకాశం రావడంతో అక్కడ చాలావరకు నెగిటివిటీ మూట కట్టడంతో బయటికి వచ్చిన ప్రియాంక ఆ తర్వాత మళ్లీ సీరియల్స్ లో కనిపించడం లేదట. అయితే మరొక కొత్త సీరియల్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమవుతున్నట్లు బుల్లితెర వర్గాలనుంచి వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి.