
కీర్తి భట్ పర్సనల్ లైఫ్ విషయాలలో మాత్రం ఎన్నో బాధలు కన్నీళ్లను సైతం చవిచూసింది. గడిచిన కొద్ది రోజుల క్రితం ఒక కారు ప్రమాదంలో ఇమే తల్లిదండ్రులతో పాటు అన్న,వదినలను కూడా కోల్పోయింది. ఈ విషయం ఈమె కెరియర్ పైన చాలా దెబ్బ పడేలా కూడా చేసింది. తాజాగా కీర్తి ఈటీవీ కి సంబంధించిన ఫ్యామిలీ స్టార్స్ షో కి వెళ్లడం జరిగింది. అక్కడ బిగ్ బాస్ గీతూ రాయల్, అలాగే సుధీర్, తదితర బుల్లితెర నటీనటులు సైతం ఇక్కడికి రావడం జరిగింది.
గీతూ రాయల్.. మాట్లాడుతూ తను చాలా డిప్రెషన్ ఉన్న సమయంలో సూసైడ్ చేసుకుంటానని భయంతో తన తండ్రి తనతో ఒక విషయం చెప్పారని దానివల్లే ఆ క్షణం నుంచి తాను ఎప్పుడూ కూడా అలాంటి ఆలోచనను తీసుకురాలేదని చెప్పింది.. ఈ మాటలు విన్నటువంటి కీర్తి భట్.. స్టేజ్ మీదకి తన ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలను పంచుకుంటూ ఒక్కసారిగా ఏడ్చేసింది. తనకోసం ఇలా వచ్చి ఎవరైనా నిలబడితే బాగుండు అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది కీర్తి.. అంతలోని స్క్రీన్ మీద ఈమె కుటుంబ సభ్యుల ఫోటోలను చూపించారు.అయితే తన దగ్గర తన తల్లిదండ్రుల ఫోటో ఆ ఒక్కటే మిగిలి ఉందంటూ చాలా ఎమోషనల్ గా ఏడ్చేసింది కీర్తి భట్.. ఈ సీన్ చూసి చాలా మంది నెటిజెన్స్ కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు.