తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మొదటిసారి 2005 లో సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి సౌత్ లో ఉన్న స్టార్ హీరోలు అందరితో కూడా నటించింది. ప్రభాస్, అనుష్క కాంబినేషన్లో వచ్చిన నాలుగు సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాయి. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సంపాదించిన అనుష్క ఈ మధ్యకాలంలో కొంతమేరకు సినిమాలు తగ్గించింది. ప్రస్తుతం ఈమె ఘాటి అనే చిత్రంలో నటిస్తూ ఉన్నది. ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ చేయబోతున్నారు.



అయితే తాజాగా అనుష్క శెట్టి కి సంబంధించి ఒక పాత  వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. అయితే ఈ వీడియోలో అనుష్క చూసిన అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు.. అనుష్క అప్పట్లో యువ అనే ఒక సీరియల్ ఒక కామియో పాత్రలో నటించినట్లు వైరల్ గా మారుతున్నది. అనుష్క నటించిన ఎపిసోడ్  పాత్ర వైరల్ గా మారుతున్నది. అయితే అనుష్క ఇందులో చాలా స్లిమ్ముగా కనిపిస్తూ వాకింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నట్లు కనిపిస్తోంది.


ఇక వీటితోపాటు రాజమౌళి, రష్మిక సీరియల్ కు సంబంధించిన లవ్ ట్రాక్ లో కనిపించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈరోజు ఈ వీడియోలో వైరల్ గా మారుతున్నాయి. రాజమౌళి, అనుష్క కాంబినేషన్లో ఎన్నో చిత్రాలు విడుదలై మంచి విషయాలను అందుకున్నాయి. అనుష్క సినిమాల విషయానికి వస్తే.. కథానార్ , భాగమతి 2 తదితర చిత్రాలలో కూడా నటిస్తూ ఉన్నది. చివరిగా అనుష్క నటించిన మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా కూడా పరవాలేదు అనిపించుకున్నది. ఇప్పుడు అన్ని కూడా లేడీ ఓరియంటెడ్ చిత్రాలే చేస్తోంది అనుష్క. మరి ఈ ఏడాది అభిమానులకు ఎలాంటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: