
ఏడుకొండలు ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి దగ్గర చాలా నమ్మకస్తులుగా ఉండేవారట. జబర్దస్త్ వల్ల కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారని మణికొండలో కూడా లగ్జరీ ఇల్లు కట్టుకున్నారనే విధంగా గతంలో పలు రకాల యూట్యూబ్ ఛానల్ లో కూడా వార్తలు వినిపించాయి.. అయితే ఈ విషయం పైన ఇటీవలే ఏడుకొండలు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇవ్వడం జరిగింది.. యాంకర్ మీరు నిజంగానే కొన్ని కోట్ల రూపాయలు జబర్దస్త్ ద్వారా సంపాదించి మణికొండలు బిల్డింగ్ కట్టుకున్నారా అన్నట్టుగా ప్రశ్నించగా?
అందుకు ఏడుకొండలు మాట్లాడుతూ.. నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి గారు అరుంధతి చిత్రంతో మంచి విజయాన్ని అందుకోవడంతో కొంతమేరకు తనకు డబ్బులు ఇచ్చారని.. అయితే తాను అప్పు చేసి ఇల్లు కట్టుకోవడం వల్ల వాటికి వడ్డీలు కట్టలేక చివరికి ఆ ఇంటిని కూడా అమ్మేసి అందరి అప్పులు తీర్చేశానని తెలిపారు. అయితే తాను ఇంటి నుంచి హైదరాబాద్ కి ఎలా వచ్చానో ప్రస్తుతం అలాగే జీవిస్తూ ఉన్నానని తెలిపారు. తాను మణికొండలో ఇల్లు కట్టాను అనే వార్త నిజం లేదని తన మీద స్టేజ్ మీద కేవలం కొన్ని కొన్ని పంచులు మాత్రమే కామెడీ కోసం వేస్తూ ఉంటారని తెలియజేశారు ఏడుకొండలు. ఏడుకొండలు టాలీవుడ్ లో చాలామంది హీరోల దగ్గర కూడా పనిచేశారట.