చాలామంది సెలబ్రిటీలు వివాహమై ఎన్నో సంవత్సరాల పిల్లలు ఉన్నప్పటికీ విడిపోయిన సందర్భాలు చాలా జంటలని చూసే ఉన్నాము.. అయితే కొంతమంది విడిపోవడం బాధగా అనిపించిన మరి కొంతమందికి ఆనందంగా ఉన్నామంటూ ఎన్నో సందర్భాలలో తెలియజేశారు. ఇప్పుడు తాజాగా ప్రముఖ నటులలో ఒకరైన కావేరి కపూర్ తన పేరెంట్స్ విడిపోవడం తనకు చాలా సంతోషంగా ఉన్నదని తెలుపుతోంది. అయితే ఆ తర్వాత కాలంలో తన మానసిక ఆరోగ్యం పైన చాలా ప్రభావం చూపించింది అంటూ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలు వెల్లడించింది.



నటి కావేరి కపూర్ ఎవరో కాదు డైరెక్టర్ శేఖర్ కపూర్, సింగర్ సుచిత్ర కృష్ణమూర్తి కుమార్తె.. ఈమె బాబి ఔర్ కుషికి లవ్ స్టోరీ అనే ఒక హిందీ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైందట. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తల్లిదండ్రులు విరిగిపోయినప్పుడు తాను ఏ విధంగా బాధపడలేదని వాళ్లు విడాకులు తీసుకున్నప్పుడు తను ఆనందంగా ఉండాలని తెలిపింది.. కానీ రాను రాను ఎక్కడో ఒక తేడా గమనించానని తల్లితండ్రులు విడిపోవడం తన మానసిక ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపించాయని.. పెద్ద అయ్యే కొద్ది ఇది చాలా ఇబ్బంది పెట్టిందని తెలిపింది..


ఇప్పటికి తాను ఈ విషయంలో ఎన్నోసార్లు స్ట్రగుల్ అవుతూనే ఉన్నానని అలాగే తనకు( ఓసిడి ) వచ్చిందని వెల్లడించింది. ప్రస్తుతం అన్నిటిని కూడా తట్టుకొని నిలబడి ఒక్కొక్కటిగా వాటి నుంచి బయటపడుతూ కోలుకుంటున్నానని పూర్తిగా బయటపడేందుకు తనకు ఇంకా కొంతమేరకు సమయం పడుతుందని వెల్లడించింది నటి కావేరి.. శేఖర్ కపూర్, సుచిత్రాకు 1999లో వివాహంకారగా వేరికి 2001లో కావేరి జన్మించిందట. అయితే ఆ తర్వాత 12 ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పి 2007లో వీరిద్దరూ విడాకులు తీసుకోవడం జరిగిందట. విడాకులు తీసుకున్న సమయంలో తనకి ఆనందంగా అనిపించిన కానీ పెద్ద అయ్యాక ఇదే లోపంగా మారిందని తెలియజేస్తోంది నటి కావేరి.

మరింత సమాచారం తెలుసుకోండి: