తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా పేరు పొందిన అనసూయ ఈమధ్య కాలంలో యాంకర్ గా కంటే నటిగా మరింత క్రేజ్ అందుకున్నది.. జబర్దస్త్ షో ద్వారా తన అందంతో, మాటలతో కామెడీ టైమింగ్ తో అందరిని ఆకట్టుకున్న అనసూయ యాంకర్ గా మెస్మరైజ్ చేసి పలు షోలను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్ళింది. ఈ మధ్య వరుసగా అవకాశాలు రావడంతో తనకు నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా చేయడానికి సిద్ధమవుతోంది. అలా ఇప్పటికీ ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలలో కూడా నటించింది అనసూయ.


ప్రస్తుతం అనసూయ హరిహర వీరమల్లు చిత్రంలో కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నదట. ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ ,జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తూ ఉండగా ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నది.. అలాగే బాబీ డియోల్ విలన్ గా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా కూడా పీరియాడికల్ యాక్షన్ చిత్రంగా రాబోతున్నది.ఇటీవలె మేకర్స్ హరిహర వీరమల్లు సినిమా నుంచి పలు రకాల అప్డేట్లను విడుదల చేస్తూ ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను మాత్రం ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు.


అనసూయ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో డాన్స్ చేయడం తనకు చాలా గర్వంగా ఉన్నదని తాను చేసిన సాంగు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నదని తెలిపింది. తాను ఎప్పటినుంచో ఈ సాంగ్ రిలీజ్ కోసం ఎదురు చూశానని పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండడంవల్ల కొంతమేరకు ఆలస్యం అయ్యిందని వెల్లడించింది. ఫైనల్ గా ఈ నెల 24న పాట రిలీజ్ కాబోతోందని తెలిపింది. అలాగే గతంలో తన మిద ట్రోల్స్ వినిపించాయి. అది కూడా డాన్స్ చేయడం వల్లే కానీ ఇప్పుడు అదే డాన్స్ తనకు కలిసి వచ్చి పవన్ కళ్యాణ్ తో డాన్స్ వేయించేలా చేస్తోంది అంటూ వెల్లడించింది. మొత్తానికి అనసూయ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: