
మే ఫస్ట్ వీక్ లో బిగ్ బాస్ తెలుగు తొమ్మిదవ సీజన్ మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. లేకపోతే సెప్టెంబర్ నెలలో మొదలయ్యే ఛాన్స్ ఉందట. అయితే ఈసారి కంటెస్టెంట్ ని కాస్త డిఫరెంట్ గా స్టార్డం ఉన్న వారిని ఎంపిక చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఈసారి యాంకర్ వర్షిణి ఉంటుందని అలాగే వీరితోపాటు ఉదయభాను వంటి వారు కూడా వచ్చే అవకాశం ఉన్నదట. అలాగే డాన్స్ షో నుంచి కూడా కొంతమంది హౌస్ లోకి అడుగు పెట్టేందుకు మక్కువ చూపుతున్నారని వారిని కూడా తీసుకునే అవకాశం ఉన్నది.
అంతేకాకుండా గత సీజన్ల నుంచి క్రేజీ సంపాదించుకున్న కొంతమంది కూడా తీసుకునే అవకాశం ఉన్నదట. బిగ్ బాస్ 7,6 నుంచి కొంతమంది కంటెస్టెంట్స్ ను కూడా తీసుకోబోతున్నారని సమాచారం.. మరి బిగ్ బాస్ తెలుగు సీజన్ గతంలో కంటే ఈసారి మరింత కొత్తగా ఉండేలా చాలా జాగ్రత్తగా ప్లాన్ తోనే ముందుకు వెళ్ళబోతున్నారట. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. మొత్తానికి బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్ మాత్రం సిద్ధమవుతోందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా ఇండియాలోనే బిగ్ బాస్ అనేది 10 భాషలలో కొనసాగుతూ ఉన్నదట. మొదట హిందీలో మొదలై ఆ తర్వాత తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం వంటి భాషలలో కూడా కొనసాగుతోంది.