గతంలో హీరోయిన్గా పలు చిత్రాలలో నటించి అద్భుతమైన విజయాలను అందుకుంది హీరోయిన్ ఇంద్రజ.. ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడంతో వివాహం చేసుకొని ఫ్యామిలీ లైఫ్ కి పరిమితమైంది వివాహమైన చాలాకాలం తర్వాత మళ్లీ ఈమె యాక్టివ్గా అయ్యి ఒకపక్క బుల్లితెర మరొకపక్క వెండితెర పైన అవకాశాలను సంపాదించుకుంటూ బిజీగా ఉన్నది. జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నది ఇంద్రజ. రోజా తర్వాత అంతటి స్థానాన్ని మళ్లీ ఇంద్రజ నే సంపాదించుకున్నది.


శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోకి కూడా ఈమె జడ్జిగా వ్యవహరించింది. దీంతో టాలీవుడ్ లో కూడా ఇంద్రజకి కొంతమేరకు డిమాండ్ పెరగడంతో వరుస సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రజ వ్యాఖ్యలు చేయడం జరిగింది.. ముఖ్యంగా జబర్దస్త్ లో అడల్ట్ కామెడీ షో చేస్తున్నారు ఎలా ఉండగలుగుతున్నారు అని యాంకర్ ప్రశ్నించగా.. అందుకు ఇంద్రజ ఇలా మాట్లాడుతూ జబర్దస్త్ లో అడల్ట్ కామెడీ ఉంటుంది అలాగే డబల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఉంటాయి తన మీద కూడా డబల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తూ ఉంటారని వెల్లడించింది.


కానీ జబర్దస్త్ షో గురించి రకరకాల కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి విమర్శలు కూడా వినిపిస్తూ ఉంటాయి.. అలాగే అన్య వ్యూస్ కూడా వస్తూ ఉంటాయి విమర్శలు వస్తున్నప్పుడు వ్యూస్ ఎలా వస్తాయని తెలిపింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కేవలం జబర్దస్త్ ఒక్కటే కాదు కానీ ఎన్నో సినిమాలు కూడా ఎక్కువగా డబల్ మీనింగ్ స్థానానికే చోటు లభిస్తోందని తెలిపింది. అయితే జబర్దస్త్ లో కూడా ఎవరు వారి యొక్క పరిధిని దాటి ఏమీ అనరని తెలిపింది. అయితే ఇలాంటి అడల్ట్ కంటెంట్ ను చి కొడుతున్న వారి కంటే చూసేవారి పదిరెట్లు ఎక్కువగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఇంద్రజ. మొత్తానికి జబర్దస్త్ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: