గడిచిన కొంత కాల క్రితం నటుడు రవీందర్ ,మహాలక్ష్మి వివాహం చేసుకున్న సందర్భంలో కూడా ఈ జంటను చూసి చాలామంది ట్రోల్ చేయడమే కాకుండా మహాలక్ష్మి కేవలం నిర్మాత వద్ద డబ్బులను చూసి పెళ్లి చేసుకుందనే విధంగా చాలామంది ఆమెను దారుణంగా అవమానించారు. అయితే ఇటీవలే రవీందర్, హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ చిత్రంలో నటించారు. ఈ విషయం రవీందర్ భార్య మహాలక్ష్మికి చాలా ఆనందాన్ని కలిగించిందని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తెలియజేసింది.



రవీందర్ తో వివాహమైన తర్వాత చాలామంది తమను హేళన చేశారని.. ఇంత అందమైన అమ్మాయికి అతనితో పెళ్లి ఏంటి అంటూ చాలామంది మెసేజ్లు కూడా చేశారని తెలిపింది. తామిద్దరము ప్రేమించుకొని వివాహం చేసుకున్నామని కానీ పెళ్లి తర్వాత చాలా విమర్శలు కూడా వినిపించాయి. వాటిని కూడా తాము భరించామని.. అయితే కొద్ది రోజుల తర్వాత విడాకులు తీసుకుంటారని విడిపోయామనే వార్తలను చూసి చాలా సార్లు నవ్వుకున్నామని తెలిపింది.మహాలక్ష్మి, రవీందర్ ను ఎలా పెళ్లి చేసుకుంది ఈ పెళ్లి ఎన్ని రోజులు ఉంటుంది అంటూ చాలామంది హేళన చేశారని కొంతమంది విడాకులు తీసుకున్నామంటూ ప్రచారం కూడా చేశారని వెల్లడించింది.


అయితే ఇలాంటి వార్తలు వచ్చినప్పుడల్లా తమ ఇద్దరం కలిసే ఉన్నామన్నట్లుగా పలు రకాల ఫోటోలను షేర్ చేయవలసి వచ్చింది.. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని వెల్లడించింది మహాలక్ష్మి. ఇలా హేళన చేస్తూ తమని టార్చర్ చేశారని.. అలాగే కొంతమంది నమ్మిన వ్యక్తులే తమకు వెన్నుపోటు పొడిచారు అంటూ వెల్లడించింది మహాలక్ష్మి. తమతో సన్నిహితంగానే ఉంటూ అలాంటి పనులు చేసే వారిని మహాలక్ష్మి ఎమోషనల్ గా మాట్లాడింది..అందుకే తమ జీవితంలో అమ్మానాన్న, భర్త ,పిల్లలు, తప్ప ఎవరిని నమ్మలేని పరిస్థితి ప్రస్తుతం అయితే ఉన్నదంటూ తెలియజేసింది. అయితే వీరికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి పేరు మాత్రం అసలు చెప్పలేదు మహాలక్ష్మి. ఇచ్చిన కొద్ది రోజుల క్రితం కొన్ని లావాదేవీల వల్ల రవీందర్ కూడా జైలుకు వెళ్లాల్సిన పని ఏర్పడింది. గతంలో సన్ మ్యూజిక్ లో హోస్ట్ గా చేసిన మహాలక్ష్మి ఆ తర్వాత సీరియల్స్ లో నటించి క్రేజ్ సంపాదించింది.. ఆ వెంటనే అనిల్ అనే వ్యక్తిని వివాహం చేసుకోగా వీరికి ఒక కొడుకు కూడా జన్మించారు కొన్ని కారణాలు చేత విడిపోగా ఆ తర్వాత రవీందర్ ని పెళ్లి చేసుకున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: