
వాస్తవానికి ఈ సినిమా మొదలై ఇప్పటికీ నాలుగేళ్ల పైనే అవుతుంది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నప్పటికీ.. ఈ సినిమా షూటింగ్ కూడా అంతే వాయిదా పడుతూ వస్తోంది. ఈ చిత్రంలోని కొల్లగొట్టిందిరో అనే పాటను కూడా చిత్ర బృందం రిలీజ్ చేయగా ప్రస్తుతం ట్రెండీగా మారుతున్నది. ఇందులో అనసూయ కూడా ఆకర్షణీయంగా కనిపించింది. అనసూయ యాంకర్ గా నటిగా కూడా పేరు సంపాదించడమే కాకుండా అవసరమైతే స్పెషల్ సాంగ్ లలో కూడా కనిపిస్తూ ఉంటుంది.
అయితే పవన్ కళ్యాణ్ తో కలసి స్టెప్పులు వేయడానికి 70 లక్షల రూపాయల వరకు డిమాండ్ చేసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అనసూయ ఇందుకోసం కేవలం మూడు రోజులు మాత్రమే తన కాల్ షీట్లను ఇచ్చినట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, బాబీ డియోల్ వంటి వారు నటిస్తూ ఉండగా ఈ చిత్రానికి సంగీతం ఎం ఎం కీరవాణి అందిస్తూ ఉన్నారు. మరి అనసూయ కేవలం మూడు రోజులకే రూ .70 లక్షల రూపాయల వరకు డిమాండ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉన్నది.